New T20 Captain: టీమిండియా టీ20 కెప్టెన్‌ బాధ్యతలు ఇక అతడికే..!

టీ20 ఫార్మెట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. అతడి స్థానంలో వన్డే, టీ20 కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పగ్గాలు అందుకోనున్నాడు.

New T20 Captain: టీమిండియా టీ20 కెప్టెన్‌ బాధ్యతలు ఇక అతడికే..!

Rohit Sharma To Succeed Virat Kohli

Team India New T20 Captain :  టీ20 ఫార్మెట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. అతడి స్థానంలో వన్డే, టీ20 కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పగ్గాలు అందుకోనున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ బాధ్యతలు చేపట్టడం ఖాయమేనని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ముగిసిన తర్వాత వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మకు వన్డే, టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్‌ అందనున్నట్టు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌ స్టోరీ తెలిపింది. కోహ్లి తర్వాత రోహిత్‌ శర్మనే టీ20 కెప్టెన్‌. టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదివరకే టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తాను తప్పుకోనున్నట్టు కోహ్లి ప్రకటించాడు. కోహ్లీ ప్రకటనతో ఇక రోహిత్‌ శర్మ టీ20 కెప్టెన్ గా ఎంపిక చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 34ఏళ్ల రోహిత్‌ శర్మను వైస్‌ కెప్టెన్‌ పదవి నుంచి తొలగించాలని కోహ్లి సెలక్షన్‌ కమిటీకి సూచించినట్టు ఇటీవల ఊహాగానాలు వినిపించాయి.

అయితే.. టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపిక అయితే.. అతడి వైస్ కెప్టెన్ స్థానంలో వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌, టీ20లలో రిషబ్ పంత్‌కు ఈ పదవి ఇవ్వాలని కోహ్లీ అభ్యర్థించాడు. అయితే అతడి విజ్ఞప్తిని బీసీసీఐ అంగీకరించలేదు. దాంతో కోహ్లి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడం ఖాయమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు అందించిన ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(5) రికార్డు నెలకొల్పాడు. ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్‌లో అక్టోబరు 24న టీమిండియా పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.
China’s New Law : చైనాలో కొత్త చట్టం…పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్ష!

కోహ్లీ అద్భుతమైన టెస్ట్ కెప్టెన్.. దేశంలోనే అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీకి పేరుంది. కోహ్లీ 65 మ్యాచ్‌ల్లో 38 విజయాలకు టీమిండియాకు సారథ్యం వహించాడు. 2017 నుంచి ఎంఎస్ ధోనీ వీడ్కోలు పలికిన తర్వాత అతని సారథ్యంలో జట్టు ఇంకా పెద్ద ట్రోఫీని గెలవలేదు. కోహ్లీ సారథ్యంలో 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకుంది. 2019 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. టోర్నమెంట్‌లో ఆ జట్టు అద్భుతంగా ఆడి ఫైనల్ హర్డిల్స్‌లో తడబడింది. కెప్టెన్‌గా కోహ్లీ ఇంకా ఐపిఎల్ ట్రోఫీని గెలువలేదు.

రోహిత్ తన నాయకత్వ నైపుణ్యాలను ఒకటి కంటే ఎక్కువసార్లు నిరూపించుకున్నాడు. 2013, 2015, 2017, 2019, 2020 లో ఐదు ఐపిఎల్ టైటిల్స్‌కి ముంబై ఇండియన్స్‌కు సారథ్యం వహించాడు. టీమిండియాకు రోహిత్ సారథ్యంలో మంచి రికార్డు కూడా అతడి పేరిట ఉంది. రోహిత్ కెప్టెన్‌గా ఉన్న 10 వన్డేల్లో, టీమిండియా 8 విజయాలు సాధించింది. ఇతడి సారథ్యంలోనే భారత జట్టు 2018 ఆసియా కప్ టైటిల్‌ను సాధించింది. ఈ టోర్నమెంట్‌లో కోహ్లీకి విశ్రాంతి లభించింది. టీ 20ల్లో, రోహిత్ 19 మ్యాచ్‌లలో టీమిండియాకు సారథ్యం వహించాడు. అందులో 2018 మార్చిలో నిదాహాస్ ట్రోఫీ టైటిల్ సహా 15 మ్యాచ్‌ల్లో జట్టు విజయం సాధించింది.
Virat Kohli : విరుష్క క్యూట్ ఫ్యామిలీ : భార్య‌, కుమార్తెతో క‌లిసి కోహ్లీ ఎంజాయ్!