T20 World Cup: ఆస్ట్రేలియాలో తమకు అందించిన ఆహార పదార్థాలపై టీమిండియా ఆగ్రహం

 ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో విజయం సాధించిన టీమిండియా రేపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో నెదర్లాండ్స్ తో రెండో మ్యాచు ఆడనుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రాక్టీసు సెషన్ జరిగింది. అనంతరం టీమిండియాకు అందించిన ఆహారంపై భారత క్రికెటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీసు అనంతరం టీమిండియాకు వేడిగా ఉన్న ఆహారం కాకుండా చల్లారిన ఆహార పదార్థాలు ఇచ్చారు.

T20 World Cup: ఆస్ట్రేలియాలో తమకు అందించిన ఆహార పదార్థాలపై టీమిండియా ఆగ్రహం

T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో విజయం సాధించిన టీమిండియా రేపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో నెదర్లాండ్స్ తో రెండో మ్యాచు ఆడనుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రాక్టీసు సెషన్ జరిగింది. అనంతరం టీమిండియాకు అందించిన ఆహారంపై భారత క్రికెటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రాక్టీసు అనంతరం టీమిండియాకు వేడిగా ఉన్న ఆహారం కాకుండా చల్లారిన ఆహార పదార్థాలు ఇచ్చారు. అందులోనూ కేవలం సాండ్‌విచ్‌ మాత్రమే ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై టీమిండియా ఐసీసీకి ఫిర్యాదు చేసిందని బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. చివరకు ఆ ఆహారాన్ని టీమిండియా తినలేదు. ఆహారం చల్లగా ఉందని తెలిపింది.

ఆహార పదార్థాలు ప్రమాణాల మేరకు లేవని, ప్రాక్టీస్‌ చేసిన తర్వాత సాండ్‌విచ్‌ ఇవ్వడం ఏంటని భారత ఆటగాళ్లు అన్నారు. ధ్వైపాక్షిక సిరీస్ లో ఆతిథ్య జట్టు ఆహారాన్ని అందిస్తుంది. అయితే, టీ20 ప్రపంచ కప్ లో ఐసీసీ ఆహారాన్ని సరఫరా చేస్తుంది. మరోవైపు, తదుపరి ప్రాక్టీస్ సెషన్ కోసం కేటాయించిన గ్రౌండ్ టీమిండియా ఉంటోన్న హోటల్ కు 45 నిమిషాల దూరంలో ఉండడంతో ఈ సెషన్ లో పాల్గొనబోమని టీమిండియా చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..