IND vs SA: దక్షిణాఫ్రికా టూర్ కోసం టీమ్ ఇండియా ఇదే కావచ్చు.. నేడే ప్రకటన!

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) దక్షిణాఫ్రికా టూర్‌కు భారత జట్టును ఇవాళ(2 డిసెంబర్ 2021) ప్రకటించనుంది.

10TV Telugu News

IND vs SA: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) దక్షిణాఫ్రికా టూర్‌కు భారత జట్టును ఇవాళ(2 డిసెంబర్ 2021) ప్రకటించనుంది. అయితే ప్రస్తుతానికి టెస్టు సిరీస్‌కు మాత్రమే జట్టును ఎంపిక చేయనుంది సెలక్షన్ కమిటీ. వన్డే సిరీస్‌కు జట్టును తర్వాత ప్రకటిస్తారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది.

డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్టుతో భారత్ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభమవుతుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. దీని తరువాత, రెండవ టెస్ట్ 2022 జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జోహన్నెస్‌బర్గ్‌లో.. మూడవ మరియు చివరి టెస్టు 2022 జనవరి 1 నుండి 5వ తేదీ వరకు కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్‌లో జరగనుంది.

కెప్టెన్సీని అజింక్య రహానే దూరం:
అజింక్య రహానే పేలవమైన ఫామ్‌ కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనలో అతనిని టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో అతని స్థానంలో రోహిత్ శర్మకు ఈ బాధ్యతను అప్పగించవచ్చు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయాస్ అయ్యర్ జట్టులో ఎంపిక కావడం ఖాయం. అదే సమయంలో దక్షిణాఫ్రికాలో భారత్-ఎ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన హనుమ విహారీని కూడా జట్టులోకి తీసుకోవచ్చు.

ఇషాంత్‌కు సెలవు:
వంద టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మను జట్టు నుండి తొలగించవచ్చు. వీరి స్థానంలో ప్రసిద్ధ క్రిష్ణ, అవేశ్ ఖాన్ వంటి యువ బౌలర్లకు అవకాశం కల్పించవచ్చు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రానున్నారు.

Vikki-Katrina : ఓ వైపు పెళ్లి వేడుకలు.. మరోవైపు విక్కీ కత్రీనాలపై కేసు నమోదు

17 మంది సభ్యులతో భారత జట్టు:
17మందితో కూడిన భారత జట్టును ఇవాళ ప్రకటించవచ్చు.. అందులో మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్), రిషబ్ పంత్ (వికెట్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్సర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ షమీ , జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ. అవేష్ ఖాన్ ఉండవచ్చు

×