ధోనీ ఈజ్ బ్యాక్: 6 వికెట్ల తేడాతో టీమిండియా శుభారంభం

ధోనీ ఈజ్ బ్యాక్: 6 వికెట్ల తేడాతో టీమిండియా శుభారంభం

హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా శుభారంభాన్ని నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే విజయం చేజిక్కించుకుంది. కంగారూలపై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉప్పల్ వేదికగా ఆసీస్ ను శాసించింది.

ఎంతగానో ఆశలు పెట్టుకున్న శిఖర్ ధావన్(0) గోల్డెన్ డక్ గా నిరాశపరిచినా ధోనీ(59), కేదర్ జాదవ్(81)ల భాగస్వామ్యంతో భారత్ కు విజయం చేజిక్కింది. ఒకానొక దశలో టీమిండియా చేతులెత్తేస్తుందనుకున్న సమయంలో ధోనీ ముందుండి జట్టును నడిపించాడు. 72 బంతుల్లో 6 ఫోర్ బౌండరీలు, ఒక సిక్సుతో చెలరేగాడు.

కెప్టెన్ కోహ్లీ(44), ఎంఎస్ ధోనీ(59), కేదర్ జాదవ్ (81)జట్టుకు ప్రాణం పోసినట్లు అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఈ మేర భారత్ కు 7 వికెట్లు కోల్పోయి 240 పరుగుల టార్గెట్ ను నిర్దేశించగలిగారు. భారత బౌలింగ్ విభాగం బాగా పనిచేయడంతో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయారు. చాలావరకూ మ్యాచ్ మొత్తం సింగిల్స్ మీదనే స్కోరు బోర్డు నడిచింది. మొత్తం మీద 2 సిక్సులు, 26 ఫోర్లు మాత్రమే చేయగలిగారు.

ఆసీస్ జట్టు మొత్తంలో ఉస్మాన్ ఖవాజా(50) మాత్రమే 76 బంతులాడి అత్యధిక స్కోరు నమోదు చేయగలిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) డకౌట్ గా వెనుదిరిగాడు. రెండో టీ20లో చెలరేగి ఆడిన గ్లెన్ మ్యాక్స్ వెల్(40) మీద నిలుపుకున్న ఆశలు నిలబెట్టుకోలేకపోయాడు. పీటర్ హ్యాండ్స్ కాంబ్(19), ఆస్టన్ టర్నర్ (21), అలెక్స్ క్యారీ(36), కౌల్టర్ నైల్(28), పాట్ కమిన్స్(0) పరుగులు చేయగలిగారు.

కంగారూలపై రెచ్చిపోయిన భారత బౌలర్లు కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 2, కేదర్ జాదవ్ 1, కుల్దీప్ యాదవ్ 2 తీయగలిగారు.  వికెట్లు పడగొట్టలేకపోయినా పరుగుల విషయంలో మాత్రం అదుపుచేయగలిగారు. బుమ్రా బౌలింగ్ లో మాత్రమే బౌండరీలు చేసేందుకు ఆసీస్ బ్యాట్స్ మెన్ కు బాగా అవకాశం దక్కింది.