IND vs SL 3rd ODI: సూర్యకుమార్, సుందర్‌కు చోటు.. ఇషాన్‌కు నిరాశే .. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..

మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, తుది జట్టులో రెండు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, చాహల్‌కు విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్.. తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించింది. ఇక, ఇషాన్ కిషన్‌కు మూడో వన్డేలోనూ అవకాశం దక్కలేదు.

IND vs SL 3rd ODI: సూర్యకుమార్, సుందర్‌కు చోటు.. ఇషాన్‌కు నిరాశే .. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..

India vs Sri lanka

IND vs SL 3rd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడో వన్డే జరుగుతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా రెండు వన్డేలు పూర్తయ్యాయి. రెండు వన్డేల్లో టీమిండియా విజయంసాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో వన్డేకూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది. మరోవైపు శ్రీలంక జట్టు మూడో వన్డేలో నెగ్గి పరువు నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది.

IND vs SL 3rd ODI: పద్మనాభస్వామి ఆలయంలో టీమిండియా ప్లేయర్లు.. బీచ్‌లో సతీమణితో కోహ్లి.. ఫొటోలు వైరల్

టీమిండియా మూడో వన్డేకు రెండు మార్పులు చేశారు. టీ20, వన్డే మ్యాచ్‌లలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్ కు మూడో వన్డేలో తుదిజట్టులో అవకాశం దక్కింది. గత రెండు మ్యాచ్ లలో సూర్యకుమార్ కు అవకాశం దక్కలేదు. మరోవైపు ఇషాన్ కిషన్ కు నిరాశే ఎదురైంది. మూడో వన్డేలోనూ ఇషాన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. సూర్యకుమార్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించింది. హార్ధిక్ పాండ్యా, చాహల్ కు విశ్రాంతినిచ్చింది. శ్రీలంక కూడా రెండు మార్పులు చేసింది.

IND vs SL 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక మూడోవన్డే.. సూర్యకుమార్, ఇషాన్‌కు చోటుదక్కేనా?

భారత్ తుది జట్టు ..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.

శ్రీలంక తుది జట్టు..

ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), అషెన్ బండార, చరిత్ అస్లంక, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లహిరు కుమార