2019 వరల్డ్ కప్.. టీమిండియా జట్టు ప్రకటన ఎప్పుడంటే?

ఐపీఎల్ 2019 సీజన్ మొదలైంది. ఐపీఎల్ 8 ఫ్రాంచైజీ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే 2019 ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆరంభం కానుంది

  • Published By: sreehari ,Published On : April 8, 2019 / 10:45 AM IST
2019 వరల్డ్ కప్.. టీమిండియా జట్టు ప్రకటన ఎప్పుడంటే?

ఐపీఎల్ 2019 సీజన్ మొదలైంది. ఐపీఎల్ 8 ఫ్రాంచైజీ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే 2019 ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆరంభం కానుంది

ఐపీఎల్ 2019 సీజన్ మొదలైంది. ఐపీఎల్ 8 ఫ్రాంచైజీ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే 2019 ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. మే 30 నుంచి వరల్డ్ కప్ వార్ జరుగనుంది. ఏప్రిల్ 23లోపే ప్రపంచ కప్ టోర్నీలో తలపడే జట్ల ప్రకటించాల్సి ఉంది.

ఈ క్రమంలో ప్రపంచ కప్ లో తలపడే 15మంది సభ్యుల టీమిండియా జట్టును భారత క్రికెట్ మండలి (BCCI) ఏప్రిల్ 15న ముంబైలో ప్రకటించనుంది. సోమవారం (ఏప్రిల్ 8, 2019) రోజున ఆఫీసు బెరర్స్ తో కూడిన బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) సమావేశం కానుంది.
Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర

ఈ సమావేశంలో వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే టీమిండియా జట్టు ప్రకటనకు సంబంధించి నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఏప్రిల్ 23లోపు ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే క్రికెట్ జట్లను ప్రకటించాల్సి ఉండగా.. షెడ్యూల్ కు 8 రోజుల ముందే బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించనుంది. యూకే (లండన్)లో మే 30 నుంచి వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

గతంలో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరిగిన అన్ని ద్వైపాక్షిక సిరీస్ లకు సంబంధించి బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు మధ్య సెటిల్ మెంట్స్ జరగాల్సి ఉంది. బీసీసీఐకి ఆస్ట్రేలియా బోర్డు నుంచి రూ.2.09 కోట్లు రావాల్సి ఉంది. దీనిపై ఇరు క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పాలకుల కమిటీతో ఆఫీసు బేరర్స్ సభ్యులు ఏప్రిల్ 20న సమావేశం కానున్నారు.  
Read Also : రేపటి రౌడీలు : కత్తులతో కేక్ కట్ చేసిన స్టూడెంట్స్