WTC Final: రెహానే వచ్చేశాడు..! డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ 2023 సీజన్‌లో రెహానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపును ఆడుతున్నారు. రెహానే మునుపెన్నడూ లేని విధంగా బ్యాట్‌తో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు.

WTC Final: రెహానే వచ్చేశాడు..! డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ

World Test Championship 2023

WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఇంగ్లాండ్‌లో జరగనుంది. ఇంగ్లాండ్‌లోని ది ఓవల్ వేదికగా జూన్ 7-11 తేదీల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించగా.. బీసీసీఐ తాజాగా రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది ఆటగాళ్లతోకూడిన భారత జట్టును ప్రకటించింది. 17నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అజింక్య రెహానే ఈ మ్యాచ్‌ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.

IPL 2023 DC Vs SRH : ఢిల్లీ చేతిలో హైదరాబాద్ ఓటమి

ఐపీఎల్ 2023 సీజన్‌లో రెహానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపును ఆడుతున్నారు. రెహానే మునుపెన్నడూ లేని విధంగా బ్యాట్‌తో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. గతంలో విదేశాల్లో జరిగిన టెస్టు మ్యాచ్‌లలోనూ రెహాన్ రాణించిన అనుభవం ఉంది. దీంతో బీసీసీఐ రెహానేను తుది జట్టులో ఎంపిక చేసింది. ఒక్క రెహానే తప్ప మొన్నటి వరకు టెస్టు మ్యాచ్‌లలో కంటిన్యూ అయిన వారినే బీసీసీఐ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఎంపిక చేసింది.

Ajinkya Rahane: ఏబీడీ, బట్లర్, వార్నర్ ను మిక్స్ చేసినట్టు.. రప్ఫాడించిన రహానే

అదేవిధంగా వికెట్ కీపర్, ఆంధ్రా క్రికెటర్ కేఎస్ భరత్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది. అయితే, మరో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి నిరాశే ఎదురైంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు. ఇంతకు ముందు జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా టీమిండియా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఈ‌సారి ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచేందుకు రోహిత్ శర్మ సారథ్యంలో జట్టు సిద్ధమవుతోంది.

IPL 2023 DC Vs SRH : ఢిల్లీ చేతిలో హైదరాబాద్ ఓటమి

బీసీసీఐ ప్రకటించిన భారత్ జట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ, అజిక్యా రెహానే, కే.ఎల్. రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.