Novak Djokovic : జకోవిచ్‌‌కు ఊరట, అనుకూలంగా తీర్పు

ఓ డిటెన్షన్ హోట‌ల్‌లో అత‌న్ని ఉంచారు. దీంతో వీసా ర‌ద్దు అంశంపై జకో కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై 2022, జనవరి 10వ తేదీ సోమవారం విచార‌ణ జ‌రగ్గా ప్రభుత్వ పిటీష‌న్‌ను కోర్టు కొట్టివేస

Novak Djokovic : జకోవిచ్‌‌కు ఊరట, అనుకూలంగా తీర్పు

Novak Djokovic

Australia Open Novak Djokovic : టెన్నిస్ స్టార్‌, వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్‌ జకోవిచ్‌కు ఊరట ల‌భించింది. ఆస్ట్రేలియా కోర్టు సంచ‌ల‌నాత్మక తీర్పును ఇచ్చింది. వీసా ర‌ద్దు కేసులో జకోవిచ్‌కు అనుకూల తీర్పు వ‌చ్చింది. దీంతో ప్రస్తుతం డిటెన్షన్ సెంట‌ర్‌లో ఉన్న జకోవిచ్ రిలీజ్ కానున్నారు. అకార‌ణంగా జకో వీసాను ర‌ద్దు చేశార‌ని, ఆ కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు చెప్పింది. కోర్టు త‌న తీర్పుతో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెక్ పెట్టింది. వీసా కేసులో గెలిచిన జకోవిచ్ ఇక ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో ఆడేందుకు లైన్ క్లియ‌రైంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ ఈ కేసులో మ‌ళ్లీ అప్పీల్‌కు వెళ్లనుంది.

Read More : AP Corona Cases : ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు.. చిత్తూరులో అత్యధికంగా…

జకో వీసా ర‌ద్దు కోసం ఇమ్మిగ్రేష‌న్ కార్యాల‌యం చర్యలు చేప‌డుతుంద‌ని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ లాయ‌ర్ ట్రాన్ ఈ విష‌యాన్ని తెలిపారు. ఒక‌వేళ ఇమ్మిగ్రేష‌న్ కార్యాల‌యం వీసా ర‌ద్దుపై నిర్ణయం తీసుకుంటే, అప్పుడు జకోవిచ్ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియా ఎంట్రీపై నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. క‌రోనా వ్యాక్సిన్ వేసుకోని జకోవిచ్‌కు.. మినహాయింపు క‌ల్పించ‌డంపై ఆస్ట్రేలియాలో తీవ్ర విమ‌ర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఆడేందుకు జకోవిచ్ మెల్‌బోర్న్ చేరుకున్నాడు. అయితే స‌రైన మిన‌హాయింపు ప‌త్రాలు లేవ‌ని అత‌ని వీసాను ప్రభుత్వం ర‌ద్దు చేసింది. ఓ డిటెన్షన్ హోట‌ల్‌లో అత‌న్ని ఉంచారు. దీంతో వీసా ర‌ద్దు అంశంపై జకో కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై 2022, జనవరి 10వ తేదీ సోమవారం విచార‌ణ జ‌రగ్గా ప్రభుత్వ పిటీష‌న్‌ను కోర్టు కొట్టివేసింది.