IND-AUS 2nd ODI : ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ కు తొలగిన వానగండం.. అభిమానుల్లో ఆనందం

విశాఖలో జరుగనున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ కు ప్రస్తుతానికి వాన గండం తొలగిపోయింది. ఎండ రావడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు.

IND-AUS 2nd ODI : ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ కు తొలగిన వానగండం.. అభిమానుల్లో ఆనందం

Visakha

IND-AUS 2nd ODI : విశాఖలో జరుగనున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ కు ప్రస్తుతానికి వాన గండం తొలగిపోయింది. ఎండ రావడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. ఇప్పటివరకు కూడా వర్షం పడితే ఒక్కసారిగా ఎండ రావడంతో క్రికెట్ అభిమానుల్లో చెప్పలేని ఆనందం కనిపిస్తోంది. అందరూ స్టేడియం లోపలికి వెళ్తున్నారు. ఇప్పటివరకు మ్యాచ్ కొనసాగుతుంతా లేదా అన్న సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఒక్కసారిగా ఎండ వచ్చింది. గంట క్రింతం నుచి ఎండ రావడంతో ఈ మ్యాచ్ కు శుభం కార్డు పడినట్లైంది.

ICC Awards: సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత.. ఐసీసీ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్

తొలి వన్డేలో విజయంతో టీమిండియా జోష్ లో ఉంది, వైజాగ్ లో రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విల్లూరుతోంది. అయితే ఫస్ట్ వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా స్కెచ్ వేస్తోంది. వైజాగ్ వన్డేలో రోహిత్ సేన విజయం సాధిస్తే టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఆసీస్ విజయం సాధిస్తే మూడో వన్డే ఇరు జట్లకు కీలకం కానుంది. తన బావ మరిది పెళ్లి కారణంగా తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డేలో ఆడనున్నాడు.

రోహిత్ ఆడితే తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. మొదటి వన్డేలో సూపర్ ఇన్నింగ్స్ తో కేఎల్ రాహుల్ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఫస్ట్ వన్డేలో విఫలమైన ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో మార్పులేమీ ఉండకపోవచ్చు. ఇక ఆసీస్ అదే టీమ్ రంగంలోకి దిగే అవకాశం ఉంది.

CCL 2023 : సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ మొదలు.. టైం అండ్ ప్లేస్ తెలుసా?

విశాఖలో టీమిండియాదే విజయమని నిపుణులు అంటున్నారు. గతంలో వైజాగ్ స్టేడియంలో జరిగిన మ్యాచుల రిజల్ట్సే ఇందుకు ఉదాహరణ అంటున్నారు. ఇప్పటివరకు 9 మ్యాచులు జరగ్గా టీమిండియా 7 సార్లు విక్టరీ కొట్టింది. ఒక మ్యాచ్ లో పరాజయం పాలైతే, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.