Ind vs Aus Test : ఆ ఇద్దరు ఇండియన్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు ప్రత్యేక కసరత్తు ..

భారత్ గడ్డపై టీమిండియాను ఓడించేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్పిన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

Ind vs Aus Test : ఆ ఇద్దరు ఇండియన్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు ప్రత్యేక కసరత్తు ..

India vs Austrealia

Ind Vs Aus: ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఫిబ్రవరి 9నుంచి భారత్ – ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టెస్టు మ్యాచ్‌లలో పైచేయి సాధించేందుకు టీమిండియా దృష్టిపెట్టింది. ఫలితంగా ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్  ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టే అవకాశం ఉంటుంది. అయితే, స్వదేశంలో భారత్ ను ఓడించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఆ విషయం ఆస్ట్రేలియాకు జట్టుకు తెలుసు. భారత్ గడ్డపై టీమిండియాను ఓడించేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్పిన్ ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

Ind Vs NZ 3rd T20I : జయహో భారత్.. టీ20 సిరీస్ కూడా మనదే, న్యూజిలాండ్‌పై తిరుగులేని విజయం

భారత్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర పటేల్ స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేకంగా సాధన చేస్తుందట. ఈ ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లు గతంలో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. అయితే, ఈసారి అలాంటి పరిస్థితి ఎదురవకుండా ఆస్ట్రేలియా ఈ ఇద్దరి బౌలర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జమ్మూ కశ్మీర్ కు చెందిన అబిద్ ముస్తాక్ ను ఆస్ట్రేలియా తమ శిబిరానికి ఆహ్వానించింది.

 

లెఫ్టార్మ్ స్పిన్నర్ అబిద్ ముస్తాక్‌కు‌కూడా అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి మెలకువలు నేర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. నెట్ ప్రాక్టీస్ లో ముస్తాక్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. తద్వారా భారత్ గడ్డపై భారత్ జట్టు స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆస్ట్రేలియా జట్టు భావిస్తుంది.

 

భారత్ – ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌లు ఇలా..

మొదటి టెస్ట్ – ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు (నాగ్‌పూర్)
రెండో టెస్ట్ – ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు (ఢిల్లీ)
మూడో టెస్ట్ – మార్చి 1 నుండి 5వరకు (ధర్మశాల)
నాల్గో టెస్ట్ – మార్చి 9 నుంచి 13 వరకు (అహ్మదాబాద్)