Shikhar Dhawan wife : టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సతీమణికి ఢిల్లీ కోర్టు కఠిన ఆదేశాలు

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సతీమణి అయేషా ముఖర్జీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కఠిన ఆదేశాలు జారీచేసింది. ధావన్‌పై ఎప్పుడు, ఎక్కడా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Shikhar Dhawan wife : టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సతీమణికి ఢిల్లీ కోర్టు కఠిన ఆదేశాలు

Shikar Dhavan

Shikhar Dhawan wife : టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సతీమణి అయేషా ముఖర్జీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కఠిన ఆదేశాలు జారీచేసింది. ధావన్ పై ఎప్పుడు, ఎక్కడా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ భార్యాభర్తలు. అయితే, వీరు 2020 నుంచి విడివిడిగా ఉంటున్నారు. కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొనేందుకు నిశ్చయించుకున్నట్లు తెలిసింది. ఈ విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. కేసు కోర్టులో నడుస్తున్న క్రమంలో తనపై అయేషా అసత్యపు ఆరోపణలతో తన పరువుకు భంగంకలిగించేలా వ్యాఖ్యలు చేస్తుందని ధావన్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసులో అయేషాను అలా చేయొద్దంటూ పాటియాలా హౌస్ కోర్టు కఠిన ఆదేశాలు ఇచ్చింది.

Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్

అయేషా ముఖర్జీ ఆస్ట్రేలియా మూలాలకు చెందిన పౌరురాలు. శిఖర ధావన్, అయేషాకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే, అయేషాకు అప్పటికే పెళ్లి అయింది. తన భర్తతో విడాకులు తీసుకుంది. ఇద్దరు కుమార్తెలుకూడా ఉన్నారు. తన మొదటి భర్తతో విడాకుల అనంతరం ధావన్‌తో పరిచయంకాస్త ప్రేమగా మారడంతో.. 2012లో అయేషా, ధావన్‌ల వివాహం జరిగింది. వీరికి 2014లో ఓ బాబు జన్మించాడు. అతని పేరు జోరావర్. 2020‌లో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడం, అదికాస్త విడాకుల వరకు వెళ్లింది. అప్పటి నుంచి వారు విడివిడిగా ఉంటున్నారు. జోరావర్ తల్లి అయేషా వద్దే ఉంటున్నాడు.

Shikhar Dhawan : విడిపోయిన శిఖర్ ధావన్ దంపతులు

శిఖర ధావన్‌కు ప్రస్తుతం 37ఏళ్లు. టీమిండియా తరపున 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే జట్టులో ధావన్ చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది చివరిలో జరిగే వన్డే ప్రపంచ కప్ జట్టులో శిఖర ధావన్‌కూడా ఎంపికయ్యాడు. అయితే, తుది జట్టులో ధావన్‌కు చోటు దక్కటం అనుమానంగానే ఉంది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ రూపంలో ధావన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి.