India vs Australia Test: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్.. స్పిన్‌ మాయాజాలం.. ఆసీస్ 177 ఆలౌట్.. .. లైవ్ అప్‌డేట్

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పైచేయి సాధించింది. జడేజా, అశ్విన్ స్పిన్ బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఫలితంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 177 పరుగులకే ఆలౌట్ అయింది.

India vs Australia Test: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్.. స్పిన్‌ మాయాజాలం.. ఆసీస్ 177 ఆలౌట్..   .. లైవ్ అప్‌డేట్

Ind Vs Aus 1st Test

India vs Australia Test: టీమిండియా స్పిన్ మాయాజాలంకు ఆస్ట్రేలియా బ్యాటర్లు తొలిరోజే చాపచుట్టేశారు. జడేజా, అశ్విన్ బౌలింగ్ దాటికి పేకమేడలా ఆసీస్ వికెట్లు కూలిపోయాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆసీస్ వికెట్లు కోల్పోతూనే వచ్చింది. ఆరంభంలో ఓపెనర్లను షమీ, సిరాజ్ లు పెవిలియన్ బాటపట్టించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్  బాధ్యతను స్పిన్నర్లు తీసుకున్నారు. ఈ క్రమంలో జడేజా ఐదు, అశ్విన్ మూడు వికెట్లు తీశారు. స్టీవ్ స్మిత్ (37), లబుషేన్ (49) భారత్ బౌలర్ల దాటికి నిలబడి స్కోర్ బోర్డు పెంచే ప్రయత్నం చేశారు. కానీ, లంచ్ బ్రేక్ తరువాత పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో అశ్విన్, జడేజాలు వరుస ఓవర్లు వేసి వికెట్లు రాబట్టారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 63.5 ఓవర్లకు కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయింది. లుబుషేన్ (49), స్మిత్ (37), అలెక్స్ క్యారీ (36), హ్యాండ్స్‌కాంబ్ (31) మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు.

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 09 Feb 2023 04:43 PM (IST)

    ముగిసిన తొలి రోజు ఆట

    ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టు, మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 77 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. మ్యాచ్‌లో మొదట ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 177 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు విలవిలలాడారు. దీంతో ఒక్క రోజు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయకుండానే, ఆస్ట్రేలియా ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు. తర్వాత రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు, షమీ, సిరాజ్ చెరో వికెట్ తీశారు.

  • 09 Feb 2023 04:35 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్..

    భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. 76 పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. టాడ్ మార్ఫీ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔటయ్యాడు. 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్, 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్ కూడా ఉంది.

  • 09 Feb 2023 04:31 PM (IST)

    రోహిత్ శర్మ అర్ధ సెంచరీ

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాథన్ లాయర్ బౌలింగ్‌లో 22.5 ఓవర్ల వద్ద ఫోర్ కొట్టిన రోహిత్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ధాటిగా ఆడుతున్న రాహుల్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • 09 Feb 2023 03:21 PM (IST)

    బ్యాటింగ్‌కు దిగిన భారత్

    ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ 177 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్ 22 బంతుల్లో 26 పరుగులతో ధాటిగా ఆఢుతున్నాడు. అతడు ఐదు ఫోర్లు సాధించడం విశేషం. మరో ఓపెనర్ రాహుల్ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు 13 బంతులాడిన రాహుల్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నాడు.

  • 09 Feb 2023 02:57 PM (IST)

    ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 177 ఆలౌట్ ..

    టీమిండియా స్పిన్నర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలంకు వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. ఫలితంగా 63.5 ఓవర్లకు 177 పరుగులకే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. హ్యాండ్స్‌కాంబ్ (31) ఔట్ అయ్యాడు. జడేజా వేసిన 62వ ఓవర్లో మూడో బాల్‌కు ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. బోలాండ్‌ను అశ్విన్ ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 177 పరుగులకే ముగిసింది. బౌలర్లలో జడేజా ఐదు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు, షమీ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు.

  • 09 Feb 2023 02:36 PM (IST)

    450 వికెట్ల క్లబ్‌లో అశ్విన్ ..

    Ashwinravin

    Ashwinravin

    భారత్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ లో 450 వికెట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు వరకు 449 వికెట్లతో ఉన్న అశ్విన్.. తాజా టెస్టులో  రెండు వికెట్లు తీయడం ద్వారా 450 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇండియా నుంచి అనిల్ కుబ్లే (619) తరువాత రెండో భారతీయ క్రికెటర్ అశ్వినే (451) కావటం గమనార్హం. టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ (800) ప్రథమ స్థానంలో ఉన్నాడు.

  • 09 Feb 2023 02:24 PM (IST)

    ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ..

    అశ్విన్, జడేజా మాయాజాలంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతున్నారు. ఇద్దరు స్పిన్నర్లు వరుస ఓవర్లు వేస్తూ వికెట్లను తీస్తున్నారు. అశ్విన్ వేసిన 57వ ఓవర్లో మూడో బాల్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (6) విరాట్ కు స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు 53వ ఓవర్లో అశ్విన్ అలెక్స్ క్యారీ (33)ను బౌల్డ్ చేశాడు. జడేజా, అశ్విన్ ధ్వయం తక్కువ సమయంలోనే ఆరు వికెట్లు తీసింది. దీంతో 60 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ 175/8. క్రీజ్‌లో హ్యాండ్స్‌కాంబ్ (29), నాథన్ ఉన్నారు.

  • 09 Feb 2023 01:12 PM (IST)

    46 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 129/5.. క్రీజ్‌లో అలెక్స్ క్యారీ(10), పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ (20) ఉన్నారు.

  • 09 Feb 2023 01:06 PM (IST)

    స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన జడేజా..

    స్పిన్నర్ రవీంద్ర జడేజా మరోసారి అదరగొట్టాడు. వరుస బాల్స్‌లో లబుషేన్ (49), రెన్ షా(0)ను పెవిలియన్ బాటపట్టిన జడేజా.. నిలకడగా ఆడుతూ ఆసీస్ స్కోర్ బోర్డు పెంచుతున్న స్టీవ్ స్మిత్ (37)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. జడేజా వేసిన 42వ ఓవర్ చివరి బంతికి స్మిత్ సరిగా అంచనావేయలేక క్లీన్‌బౌల్డ్ కావటంతో పెవిలియన్ బాటపట్టాడు. దీంతో జడేజా ఖాతాలో మూడు వికెట్లు చేరాయి.

     

    JADEJA

    JADEJA

  • 09 Feb 2023 12:41 PM (IST)

    ఆసీస్‌ను మళ్లీ కష్టాల్లోకి నెట్టిన జడేజా ..

    లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు మరోసారి గట్టిఎదురు దెబ్బ తగిలింది. లబుషేన్(49) జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అర్థశతకంకు ఒక పరుగు దూరంలో ఉన్న లబుషేన్ ముందుకొచ్చి ఆడబోయాడు. అప్రమత్తమైన వికెట్ కీపర్ భరత్ అద్భుతమైన స్టంపౌట్‌తో లబుషేన్ పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన రెన్ షా జడేజా బౌలింగ్‌లో ఎల్బీలో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్ డీఆర్ఎస్ కు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఒకే ఓవర్లో జడేజా రెండు వికెట్లు తీసి ఆసీస్ ను మళ్లీ కష్టాల్లోకి నెట్టేశాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ (25), హ్యాండ్స్ స్కాబ్ క్రీజ్ లో ఉన్నారు.

  • 09 Feb 2023 11:28 AM (IST)

    దూకుడు పెంచిన ఆస్ట్రేలియా ..

    ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ దూకుడు పెంచారు. 30 ఓవర్లు పూర్తయ్యే సరికి 75/2 పరుగులు చేశారు. స్మిత్ (18), లాబుస్చాగ్నే (47) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరి భాగస్వామ్యం ఆఫ్ సెంచరీ దాటింది.

  • 09 Feb 2023 10:51 AM (IST)

    18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 44/2.. స్మిత్ (10), లాబుస్చాగ్నే (24).

    ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాలోమునిగిపోయిన ఆస్ట్రేలియా .. క్రమంగా పుంజుకుంటోంది. స్మిత్, లాబుస్చాగ్నే ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును క్రమంగా పెంచుతున్నారు. లాబుస్చాగ్నే దూకుడు పెంచాడు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవీందర్ జడేజాలు బౌలింగ్ వేస్తున్నారు.

  • 09 Feb 2023 10:23 AM (IST)

    11 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 28/2.. స్మిత్ (6), లాబుస్చాగ్నే (14).

  • 09 Feb 2023 10:18 AM (IST)

    9 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 26/2.. స్మిత్ (6), లాబుస్చాగ్నే (13). వరుసగా మూడు ఓవర్లలో ఒక్క పరుగును ఆస్ట్రేలియా బ్యాటర్లు రాబట్టలేక పోయారు. స్పిన్నర్ జడేజా వేసిన ఏడో ఓవర్లో కేవలం లెగ్‌బైస్ రూపంలో ఒక్క పరుగు వచ్చింది. ఆ తరువాత అక్షర్ పటేల్ వేసిన 8వ ఓవర్ పరుగులేమీ రాలేదు. ఆ తరువాత 9వ ఓవర్ సిరాజుద్దీన్ వేయగా ఆ ఓవర్లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగులు రాబట్టలేక పోయారు.

  • 09 Feb 2023 10:13 AM (IST)

    8 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 26/2.. స్మిత్ (6), లాబుస్చాగ్నే (13).

  • 09 Feb 2023 10:03 AM (IST)

    6 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 25/2.. స్మిత్ (6), లాబుస్చాగ్నే (13).

  • 09 Feb 2023 09:58 AM (IST)

    ఆచితూచి ఆడుతున్న స్మిత్, లాబుస్చాగ్నే ..

    ఆస్ట్రేలియా ఆట ప్రారంభమైన పదిహేను నిమిషాల వ్యవధిలోనే రెండు వికెట్లను (ఓపెనర్లు) కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన స్టీవ్ స్మిత్, లాబుస్చాగ్నే ఆచితూచి ఆడుతున్నారు. ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 20/2.

  • 09 Feb 2023 09:50 AM (IST)

    ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. రెండు వికెట్లు డౌన్..

    ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సిరాజుద్దీన్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ కు పంపాడు. అద్భుతమైన బంతితో వికెట్ల ముందు ఖవాజాను దొరకబుచ్చుకున్నాడు.

    IND vs AUS 1st Test Match

    IND vs AUS 1st Test Match

    మహ్మద్ షమీ వేసిన మూడో ఓవర్లో మరో ఓపెనర్ వార్నర్ (1) పెవిలియన్ బాట పట్టాడు. దీంతో మ్యాచ్ ప్రారంభమైన 15 నిమిషాల వ్యవవధిలో ఆస్ట్రేలియా 2 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నేలు ఉన్నారు.

    Image

  • 09 Feb 2023 09:40 AM (IST)

    చెతేశ్వర్ పుజారా చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్న కోన భరత్..

    ఆంధ్రా ఆటగాడు కె.ఎస్ భరత్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. నాగ్‌పూర్‌లో జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్‌లో భరత్ అరంగ్రేటం చేశాడు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా చేతులు మీదుగా భరత్ టెస్ట్ క్యాప్ అందుకున్నారు.

  • 09 Feb 2023 09:28 AM (IST)

    టెస్ట్ ఫార్మాట్‌లో నేడు ముగ్గురు క్రికెటర్లు అరంగ్రేటం ..

    టీ20 ఫార్మాట్‌లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ స్కోర్ చేయడంలో టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ దిట్ట. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లలో సూర్య తనసత్తాను చాటుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లలో పెద్దగా రాణించలేక పోయిన సూర్యకుమార్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకొని అరంగ్రేటం చేయనున్నాడు. మరోవైపు యంగ్ క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ తొలిసారి టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు టాడ్ మర్ఫీ కూడా తుదిజట్టులో అవకాశం దక్కడంతో టెస్టు క్రికెట్ లో అరంగ్రేటం చేయనున్నారు.

  • 09 Feb 2023 09:12 AM (IST)

    భారత్‌ తుది జట్టు ఇదే:

    రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్‌ రాహుల్‌, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్, కేఎస్‌ భరత్‌ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్‌

    Image

    ఆస్ట్రేలియా తుది జట్టు ..

    డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్ చాగ్నే, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్‌షా, పీటర్ హ్యాండస్కాంబ్, అలెక్స్ కారీ ( వికెట్ కీపర్); పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, టాడ్ మార్ఫీ, స్కాట్ బోలాండ్.

  • 09 Feb 2023 09:05 AM (IST)

    టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..

    నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

  • 09 Feb 2023 09:01 AM (IST)

    భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌ల రికార్డు ..

    ఇరు‌జట్ల మధ్య మొత్తం టెస్ట్ మ్యాచ్‌లు: 102
    భారత్ జట్టు గెలిచింది: 30
    ఆస్ట్రేలియా గెలిచింది: 43
    డ్రా అయిన మ్యాచ్ ల సంఖ్య: 28

  • 09 Feb 2023 08:42 AM (IST)

    నాగ్‌పూర్ పిచ్ ఎలా ఉంటుందంటే..

    నాగ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ ప్రారంభమయ్యాక ఎంత తొందరగా బాల్ టర్న్‌ కావడం మొదలవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే రెండు జట్ల స్పిన్నర్లే మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనున్నారు. మ్యాచ్ కు ముందురోజు బయటికి వచ్చిన ఫొటోల్లో ఏ మాత్రం పచ్చిక లేకుండా పగుళ్లతో కనిపించింది. దీంతో తొలి రోజు నుంచే స్పిన్నర్లు చెలరేగడం ఖాయంగా కనిపిస్తొంది.

  • 09 Feb 2023 08:35 AM (IST)

    బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రికార్డుకెక్కారు. ఈ ట్రోఫీలో సచిన్ తొమ్మిది సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా ప్లేయర్ స్మిత్ మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును అదిగమించే అవకాశం ఉంది.

  • 09 Feb 2023 08:25 AM (IST)

    తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చాన్స్ దక్కేనా?

    భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా ఇవాళ ఉదయం 9.30గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇరు దేశాల జట్లు స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. టీమిండియాలో నలుగురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రవిచంద్ర అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లలో ముగ్గురు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అశ్విన్, జడేజాలకు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్‌లలో ఒకరు తుది జట్టులో ఎంపిక కానున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టుసైతం స్పిన్నర్లకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఆ జట్టు నుంచి ఇద్దరు స్పిన్నర్లు తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.

  • 09 Feb 2023 08:16 AM (IST)

    ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు స్పినర్ రవిచంద్ర అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. టెస్టుల్లో 450 వికెట్లు పడగొట్టి రెండో భారత బౌలర్‌గా నిలిచేందుకు అశ్విన్ ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకోసం అశ్విన్ ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే (619) నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.