IND-AUS 2nd ODI Suspense : ఇండియా-ఆస్ట్రేలియా రెండో వన్డేకు భారీ వాన గండం.. మ్యాచ్ నిర్వహణపై కొనసాగుతున్న ఉత్కంఠ

విశాఖలో ఆదివారం (మార్చి19)న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వన్డే మ్యాచ్ కు వరుణ గండం ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

IND-AUS 2nd ODI Suspense : ఇండియా-ఆస్ట్రేలియా రెండో వన్డేకు భారీ వాన గండం.. మ్యాచ్ నిర్వహణపై కొనసాగుతున్న ఉత్కంఠ

Ind-Aus ODI

IND-AUS 2nd ODI Suspense : విశాఖలో ఆదివారం (మార్చి19)న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వన్డే మ్యాచ్ కు వరుణ గండం ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మ్యాచ్ పై సందిగ్థత ఏర్పడింది. ఒక్కసారిగా మళ్లీ వాతావరణం మారింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మళ్లీ వాన కురుస్తోంది. మ్యాచ్ కు భారీ వాన గండం పొంచి ఉంది. వర్షానికి తడవకుండా పిచ్ ను పూర్తిగా కప్పిన స్టేడియం నిర్వహికులు అవుట్ ఫీల్డ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.

విశాఖ వన్డే మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. క్రికెట్ అభిమానులు నిరాశలో ఉన్నారు. క్రికెటర్ల రాక కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. వర్షం తగ్గి మ్యాచ్ జరిగితే ఫస్ట్ వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ స్కెచ్ వేస్తోంది. వైజాగ్ వన్డేలో రోహిత్ సేన విజయం సాధిస్తే టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఆసీస్ విజయం సాధిస్తే మూడో వన్డే ఇరు జట్లకు కూడా కీలకం కానుంది. తన బావ మరిది పెళ్లి కారణంగా తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డేలో ఆడనున్నాడు.

IND-AUS Second ODI : వైజాగ్ లో భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే.. వరుణ గండంతో మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ!

రోహిత్ ఆడితే తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. మొదటి వన్డేలో సూపర్ ఇన్నింగ్స్ తో కేఎల్ రాహుల్ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఫస్ట్ వన్డేలో విఫలమైన ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో మార్పులేమీ ఉండకపోవచ్చు. ఇక ఆసీస్ అదే టీమ్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఎవరి అంచనాల్లో వారుంటే క్రికెట్ ఫ్యాన్స్ కు మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న టెన్షన్ నెలకొంది.