Sourav Ganguly: క్రికెటర్లకు మరణ భయం పుట్టుకొచ్చింది – గంగూలీ

ఇంగ్లాండ్ తో టీమిండియా ఆడాల్సిన ఐదో మ్యాచ్ రద్దు అయింది. టీమిండియా ఫిజియోకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కొద్ది గంటల వ్యవధిలోనే..

Sourav Ganguly: క్రికెటర్లకు మరణ భయం పుట్టుకొచ్చింది – గంగూలీ

Saurav Ganguly

Sourav Ganguly: ఇంగ్లాండ్ తో టీమిండియా ఆడాల్సిన ఐదో మ్యాచ్ రద్దు అయింది. టీమిండియా ఫిజియోకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కొద్ది గంటల వ్యవధిలోనే మ్యాచ్ రద్దు చేసుకున్నాయి ఇరు జట్ల బోర్డులు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్రెసిడెంట్ దీనిపై స్పందిస్తూ.. ఇండియన్ ప్లేయర్లకు ఈ వార్త తెలియగానే మరణ భయం కనిపించిందని అన్నారు.

బీసీసీఐ.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ)తో పలు రౌండ్లు చర్చలు జరిపి ఆ రోజు మ్యాచ్ రద్దు చేయడంతో పాటు రీషెడ్యూల్ చేసుకుందామని తేల్చింది. జూనియర్ ఫిజియోకు పాజిటివ్ రాగా, మెయిన్ ఫిజియో నితిన్ పటేల్ ఐసోలేషన్ కు వెళ్లిపోయాడు.

‘ఆ సమయంలో ప్లేయర్లు ఆడటానికి నిరాకరించారు. వాళ్లని నిందించడం కరెక్ట్ కాదు. పర్మార్ ప్లేయర్లతో క్లోజ్ కాంటాక్ట్ తో వ్యవహరించాడు. నితిన్ పటేల్ ఐసోలేషన్ కు వెళ్లిపోగానే ప్లేయర్లకు కొవిడ్ టెస్టు నిర్వహించాం’ అని ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

వాళ్లతో పాటు ప్రతిరోజు ఆటలోనూ ఉండే.. ఫిజియోకు పాజిటివ్ రాగానే భయం రావడం సహజం. వాళ్లంతా కచ్చితంగా కొవిడ్ పాజిటివ్ కు లోనయ్యామని మరణ భయంతో కనిపించారు. అలాంటప్పుడు బబుల్ లో ఉండటం అంత సులువేం కాదు. వారి ఫీలింగ్స్ ను మనం గౌరవించాలి’

Read Also: US Open : ఓటమి తర్వాత..రాకెట్‌ను నేలకేసి కొట్టాడు, భావోద్వేగం

‘ఫలితంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టు క్యాన్సిల్ అయింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ఘోరమైన నష్టం వాటిల్లింది. దీనిని ఎదుర్కోవడం వారికి కాస్త కష్టమే. పరిస్థితులు సెట్ అయ్యాక మళ్లీ మ్యాచ్ గురించి ఆలోచిద్దామని ఉంచాం. వచ్చే ఏడాది మ్యాచ్ నిర్వహిస్తే మాత్రం అది సిరీస్ కు కంటిన్యూషన్ కాలేదు’ అని పేర్కొన్నారు.

దీనిని బట్టి షెడ్యూల్ మార్చుకుని ప్రస్తుత ఏడాదే మ్యాచ్ నిర్వహిస్తారు. లేదంటే ఇక ఐదో టెస్ట్ మ్యాచ్ లేనట్లే.