IPL 2021: రేపటి నుంచే ఐపీఎల్ సెకండాఫ్.. షెడ్యూల్ ఇదే!

క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ సెకండ్ హాఫ్ సిద్ధం అవుతోంది.

IPL 2021: రేపటి నుంచే ఐపీఎల్ సెకండాఫ్.. షెడ్యూల్ ఇదే!

Ipl

IPL 2021: క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ సెకండ్ హాఫ్ సిద్ధం అవుతోంది. రేపటి నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్‌-2021 విజేత గురించి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. IPL 2021 ఈ ఏడాది ఏప్రిల్‌లోనే భారత్‌లో ప్రారంభమైంది, కానీ కొంతమంది ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా సోకిన తర్వాత సిరీస్ వాయిదా పడింది. దీంతో లీగ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

ఐపిఎల్ 2021 రెండవ భాగంలో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో రాత్రి 07:30 నుండి జరుగుతుంది. మునుపటిలాగే, ద్వితీయార్థంలో కూడా మధ్యాహ్నం మ్యాచ్‌లు 03:30 కి మరియు సాయంత్రం మ్యాచ్‌లు 07:30 కి జరగబోతున్నాయి.

ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లు షార్జా, అబుదాబి మరియు దుబాయ్‌లో జరగనున్నాయి. ఐపిఎల్ 2020 సీజన్ కూడా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగింది. దీనిని ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఐపిఎల్ 2021 ద్వితీయార్థంలో మొత్తం 31 మ్యాచ్‌లు జరగనున్నాయి.

షెడ్యూల్ ఇదే!

సెప్టెంబర్ 19 – చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ 07:30 PM

సెప్టెంబర్ 20 – కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 07:30 PM

సెప్టెంబర్ 21 – పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ 07:30 PM

సెప్టెంబర్ 22 – ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 07:30 PM

సెప్టెంబర్ 23- ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ 07:30 PM

సెప్టెంబర్ 24 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ 07:30 PM

సెప్టెంబర్ 25 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ 03:30 PM
2 వ మ్యాచ్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 07:30 PM

సెప్టెంబర్ 26- చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్యాహ్నం 03:30 PM
2 వ మ్యాచ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ 07:30 PM

సెప్టెంబర్ 27 – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ 07:30 PM

సెప్టెంబర్ 28 – కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ 03:30 PM
2 వ మ్యాచ్ – ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 07:30 PM

సెప్టెంబర్ 29- రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 07:30 PM

సెప్టెంబర్ 30- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ 07:30 PM

అక్టోబర్ 01- కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 07:30 PM

అక్టోబర్ 02- ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ 03:30 PM
2 వ మ్యాచ్- రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ 07:30 PM

అక్టోబర్ 03- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ 03:30 PM
2 వ మ్యాచ్- కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 07:30 PM

అక్టోబర్ 04- ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ 07:30 PM

అక్టోబర్ 05- రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 07:30 PM

అక్టోబర్ 06- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 07:30 PM

అక్టోబర్ 07- చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 03:30 PM
2వ మ్యాచ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ 07:30 PM

అక్టోబర్ 08- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 03:30 PM
2వ మ్యాచ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ 03:30 PM

అక్టోబర్ 10 – క్వాలిఫయర్ 1
అక్టోబర్ 11 – ఎలిమినేటర్
అక్టోబర్ 13 – క్వాలిఫయర్ 2

15 అక్టోబర్ – ఫైనల్