T20 World Cup 2021: అంపైర్ నిద్రపోతున్నాడా… నో-బాల్‌కు కేఎల్ రాహుల్ అవుట్ ఇస్తారా..

రోహిత్ డకౌట్‌ తర్వాత కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ జోడీ కాసేపైనా నిలబడతారనుకుంటే షహీన్ అఫ్రీది బౌలింగ్‌లో తడబడ్డ ఓపెనర్ వెనుదిరగాల్సి వచ్చింది.

T20 World Cup 2021: అంపైర్ నిద్రపోతున్నాడా… నో-బాల్‌కు కేఎల్ రాహుల్ అవుట్ ఇస్తారా..

Kl Rahul No Ball

T20 World Cup 2021: భారీ అంచనాలతో మొదలైన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఆరంభం నుంచే ఇబ్బందులు కనిపించాయి. రోహిత్ డకౌట్‌ తర్వాత కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ జోడీ కాసేపైనా నిలబడతారనుకుంటే షహీన్ అఫ్రీది బౌలింగ్‌లో తడబడ్డ ఓపెనర్ వెనుదిరగాల్సి వచ్చింది. రాహుల్ అవుట్ పెద్ద తప్పిదమని.. నో బాల్ కు అవుట్ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

కేవలం 6పరుగుల లోపే రెండు వికెట్లు పడగొట్టిన అఫ్రీదికి దక్కిన రెండో వికెట్ కరెక్ట్ గా జరిగింది కాదని, నో బాల్ కు అవుట్ ఇచ్చిన అంపైర్ నిద్రపోతూ చెప్తున్నాడా అని కౌంటర్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సైతం వైరల్ అయ్యాయి.

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలిచిన తర్వాత షహీన్ అఫ్రీది.. 6/2తో జట్టులో పాక్ జట్టులో ఉత్సాహాన్ని పెంచారు. రోహిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం, ఆ తర్వాతే రాహుల్ పెవిలియన్ బాటపట్డం, సూర్యకుమార్ యాదవ్ 6,4 బాది హసన్ అలీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

………………………………………………: టీమిండియా దారుణ వైఫల్యం.. చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్

విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 49 బంతుల్లో 57పరుగులు చేయడంతో ఇండియా 20ఓవర్లలో 151పరుగులు మాత్రమే చేసింది. చేధనలో పాక్ ఓపెనర్లు 152పరుగులు లక్ష్యాన్ని అవలీలగా సాధించారు.