Ricky Ponting: భారత టీ20 క్రికెట్‌లో షమీ కంటే ఉత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు: రికీ పాంటింగ్

భారత టీ20 క్రికెట్ జట్టులో మొహమ్మద్ షమీ కంటే మెరుగైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. తాజాగా రికీ పాంటింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘షమీ చాలాకాలంగా టీమిండియాలో ఉత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడి బలాలను చూస్తే టెస్టు క్రికెట్లో అత్యుత్తమంగా బౌలింగ్ చేయగలడు. అయితే, భారత్ టీ20 క్రికెట్ జట్టులో షమీ కంటే ఉత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని అనుకుంటున్నాను. ఆసియా కప్ కు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను మాత్రమే ఎంపిక చేశారు. నలుగురిని ఎంపిక చేసి ఉంటే ఆ నాలుగో బౌలర్ గా షమీ ఉండేవాడు’ అని రికీ పాంటింగ్ చెప్పారు.

Ricky Ponting: భారత టీ20 క్రికెట్‌లో షమీ కంటే ఉత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు: రికీ పాంటింగ్

World T20I team top-5

Ricky Ponting: భారత టీ20 క్రికెట్ జట్టులో మొహమ్మద్ షమీ కంటే మెరుగైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. తాజాగా రికీ పాంటింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘షమీ చాలాకాలంగా టీమిండియాలో ఉత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడి బలాలను చూస్తే టెస్టు క్రికెట్లో అత్యుత్తమంగా బౌలింగ్ చేయగలడు. అయితే, భారత్ టీ20 క్రికెట్ జట్టులో షమీ కంటే ఉత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని అనుకుంటున్నాను. ఆసియా కప్ కు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను మాత్రమే ఎంపిక చేశారు. నలుగురిని ఎంపిక చేసి ఉంటే ఆ నాలుగో బౌలర్ గా షమీ ఉండేవాడు’ అని రికీ పాంటింగ్ చెప్పారు.

కాగా, జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయం కారణంగా ఆసియా కప్ కు దూరం కావడంతో షమీకి చోటు దక్కుతుందని భావించారు. అయితే, షమీ ఆసియా కప్ లో ఆడడం లేదు. ఆసియా కప్ దుబాయి, షార్జాలో ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు జరగనుంది. ఆసియా కప్ ను గెలుచుకునే అవకాశాలు టీమిండియాకే అధికంగా ఉన్నాయని రికీ పాంటింగ్ తెలిపిన విషయం తెలిసిందే. మొదట శ్రీలంక వేదికగా ఆసియా క‌ప్‌ నిర్వహించాలని అనుకున్నారు. అయితే, శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో దాన్ని దుబాయి, షార్జాకు మార్చారు. దీన్ని టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తారు. ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు.

Weather alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం