Wrestlers: రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు దొరకలేదు.. ఇక కోర్టులో..: పోలీసు వర్గాలు

బ్రిజ్ భూషణ్ నుంచి ఎదురైన లైంగిక వేధింపులపై కొన్ని నెలల నుంచి మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే.

Wrestlers – Police: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)పై ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇప్పటివరకు సరైన ఆధారాలు లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు (Delhi Police) చెప్పాయి. 15 రోజుల్లో తాము న్యాయస్థానానికి నివేదికను సమర్పిస్తామని అధికారులు అన్నారు.

బ్రిజ్ భూషణ్ నుంచి ఎదురైన లైంగిక వేధింపులపై కొన్ని నెలల నుంచి మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించబోమని అంటున్నారు. ఇప్పటికే వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్రాంత పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పోలీసు వర్గాలు తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడాయి. తాము 15 రోజుల్లో న్యాయస్థానంలో సమర్పించే నివేదిక ఛార్జిషీట్ లేదా ఫైనల్ రిప్టోర్ట్ రూపంలో ఉంటుందని అధికారులు తెలిపారు. రెజ్లర్లు చేసిన ఆరోపణలకు అనుకూలంగా మాత్రం తమకు ఎటువంటి ఆరోపణలూ లభించలేదని స్పష్టం చేశారు.

పోక్సో కింద కేసు ఉన్నప్పటికీ, బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయలేమని అన్నారు. బాధితులు మాత్రం ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. సాక్షులను ప్రభావితంగా చేయడం, ఆధారాలను ధ్వంసం చేయడం వంటి నేరాలకు ఆయనేం పాల్పడడం లేదు కదా అని చెప్పారు.

Wrestlers protest: గంగలో విసిరేస్తామన్నారు, ఏమైంది?.. రెజ్లర్లపై మరోసారి విరుచుకుపడ్డ బ్రిజ్ భూషణ్

ట్రెండింగ్ వార్తలు