India vs Bangladesh: మూడో రోజు ఆట పూర్తి.. పూజారా, గిల్ సెంచరీలు.. బంగ్లాదేశ్ లక్ష్యం 513

ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట పూర్తైంది. బంగ్లాదేశ్‌కు ఇండియా 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా సెంచరీ సాధించడం విశేషం.

India vs Bangladesh: మూడో రోజు ఆట పూర్తి.. పూజారా, గిల్ సెంచరీలు.. బంగ్లాదేశ్ లక్ష్యం 513

India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో మూడో రోజు ఆట పూర్తైంది. ఈ రోజు ఇండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 258 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో 513 పరుగుల లక్ష్యంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు

శుక్రవారం ఆట ముగిసే సమయానికి బంగ్లా 12 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు నజ్ముల్ హొసైన్ షాంటో 25 పరుగులతో, జాకీర్ హసన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 133/8 స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన బంగ్లాదేశ్ మరో 17 పరుగులు మాత్రమే చేసి, 150 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 404 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌కు సంబంధించి మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీయగా, సిరాజ్ 3 వికెట్లు, ఉమేష్ యాదవ్, అక్షర్ పటేలో చెరో వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియాకు 254 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ త్వరగానే కోల్పోయింది. 62 బంతులాడిన రాహుల్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో తొలి సెంచరీ సాధించాడు.

FIFA World Cup 2022: ముగింపు దశలో ఫిఫా వరల్డ్ కప్.. ఖాళీ అయిన ఖతార్.. వెలవెలబోతున్న హోటళ్లు

గిల్ 152 బంతుల్లో 110 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడికి తోడుగా మరో బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పూజారా కూడా సెంచరీ సాధించాడు. 130 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పూజారా సెంచరీ పూర్తికాగానే ఇండియా 258 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పూజారా నాలుగు సంవత్సరాల తర్వాత టెస్టుల్లో సెంచరీ సాధించడం విశేషం. ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి విరాట్ కోహ్లీ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో టీమిండియా బంగ్లాకు 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట పూర్తయ్యే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ కోల్పోకుండా 42 పరుగులు సాధించింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే మరో 472 పరుగులు చేయాలి.