WTC Final 2023: గ‌త డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా చేసిన త‌ప్పులు ఇవే..? వీటిని స‌రిదిద్దుకోకుంటే..

ఐపీఎల్ ముగిసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్(WTC Final) పైనే ఉంది. లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు భార‌త్‌(Team India), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మ‌ధ్య డ‌బ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

WTC Final 2023: గ‌త డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా చేసిన త‌ప్పులు ఇవే..? వీటిని స‌రిదిద్దుకోకుంటే..

rohi-dravid

WTC Final: ఐపీఎల్(IPL) ముగిసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్(WTC Final) పైనే ఉంది. లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు భార‌త్‌(Team India), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మ‌ధ్య డ‌బ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు లండ‌న్ చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లుపెట్టాయి. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ చేర‌డం భార‌త్‌కు ఇది వ‌రుస‌గా రెండోసారి.

మొద‌టి ఎడిష‌న్‌(2019-21) లో సైతం ఫైన‌ల్ చేరుకున్న‌ప్ప‌టికి సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓట‌మి పాలైంది టీమ్ఇండియా. ఈ నేప‌థ్యంలో నాటి మ్యాచ్ నుంచి టీమ్ఇండియా ముఖ్యంగా మూడు అంశాల‌పై మరింత క‌స‌ర‌త్తు చేస్తే ఆసీస్‌పై విజ‌యం సాధించి తొలిసారి డ‌బ్ల్యూటీసీ ట్రోఫీని ముద్దాడొచ్చు.

టీమ్ కాంబినేషన్

మ్యాచుల్లో విజ‌యం సాధించాలంటే ముఖ్యంగా జ‌ట్టు కూర్పు స‌రిగ్గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. సౌతాంప్టన్‌లో మ్యాచ్‌కు ముందు వ‌ర్షం ప‌డినా, మ‌బ్బులు ప‌ట్టిన వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికీ టీమ్ఇండియా ఇద్ద‌రు స్పిన్న‌ర్లు ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌తో పాటు ముగ్గురు పేస‌ర్ల‌తో బ‌రిలోకి దిగింది. ఈ వ్యూహాం భార‌త్‌ను భారీగా దెబ్బ‌తీసింది. పిచ్ పేస‌ర్ల‌కు అనుకూలిస్తుంద‌ని తెలిసినా స‌రైన కూర్పును ఎంచుకోలేక‌పోయింది. నాలుగో పేస‌ర్ లేని లోటు స్ప‌ష్టంగా కనిపించింది. జ‌డేజా ఈ మ్యాచ్‌లో కేవ‌లం వికెట్ మాత్ర‌మే తీశాడు.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు ఆస్ట్రేలియాను భ‌య‌పెడుతున్న చెత్త రికార్డు

మరోవైపు న్యూజిలాండ్ నలుగురు సీమర్లను ఆడించింది. ఇది కివీస్‌కు బాగా క‌లిసివ‌చ్చింది. న్యూజిలాండ్ బౌల‌ర్లు పేస్‌తో పాటు బౌన్స్‌ను రాబ‌ట్టి భార‌త బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెట్టారు. ఈ సారి మ్యాచ్ ఓవ‌ల్‌లో జ‌ర‌గ‌నుంది. అక్క‌డి పిచ్ పేస్‌కు అనుకూలం అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో రోహిత్ సేన జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ప‌రిస్థితుల‌కు స‌రిపోయేట‌ట్లు తుది జ‌ట్టును ఎంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అన‌వ‌స‌ర ప్ర‌యోగాల‌కు పోకుంటా ఉంటే మంచిది.

స్లిప్ ఫీల్డింగ్

స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేయ‌డం అంత ఈజీ కాదు. మిగిలిన స్థానాల్లో ఫీల్డింగ్ చేయ‌డంతో పోలిస్తే చాలా త‌క్కువ స‌మ‌యంలో స్లిప్‌లో రియాక్ట్ కావాల్సి ఉంటుంది. గ‌త కొంత‌కాలంగా భార‌త స్లిప్ ఫీల్డింగ్ ఆందోళ‌న క‌లిగిస్తోంది. సునాయ‌స క్యాచ్‌ల‌ను కూడా జార‌విడిచిన సంద‌ర్భాలు ఉన్నాయి. స్లిప్‌ ఫీల్డింగ్ విష‌యంలో ఫీల్డింగ్ కోచ్ దిలీప్ దృష్టి సారించాలి.  పేస్‌, స్వింగ్‌తో వ‌చ్చే బంతుల‌ను ఎలా ఒడిసిప‌ట్టాల‌నే దానిపై ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వాలి. ఒక్క క్యాచ్ మిస్ చేసినా అది మ్యాచ్ ఫ‌లితాన్నే ప్ర‌భావితం చేయొచ్చు అన్న సంగ‌తి తెలిసిందే. అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లిలు ఫైన‌ల్ మ్యాచ్‌లో ఎక్కువ‌గా స్లిప్‌లో ఫీల్డింగ్ చేసే అవ‌కాశం ఉంది.

WTC Final 2023: న‌యావాల్‌ మారిపోయాడా..! టీమ్‌తో క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం లేదు.. సొంత కారులో.. ఆశ్చ‌ర్య‌పోయిన జ‌డేజా

టాప్ ఆర్డ‌ర్ రాణించాల్సిందే

టీమ్ఇండియా టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు భారీ స్కోర్లు సాధించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. ముఖ్యంగా టాప్-3 ఆట‌గాళ్లు అయిన రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌, ఛ‌తేశ్వ‌ర్ పుజారాల్లో క‌నీసం ఇద్ద‌రు అయినా భారీ శ‌త‌కాలు చేయాలి. గ‌త ఫైన‌ల్ మ్యాచ్‌లో వీరు విఫ‌లం కావ‌డంతో మిడిల్ ఆర్డ‌ర్‌పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 217, రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే టీమ్ఇండియా ఆలౌటైంది.

ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఇంగ్లాండ్‌లోని పరిస్థితుల‌పై మంచి అవ‌గాహాన ఉంది. అక్క‌డ ఎలా బ్యాటింగ్ చేయాలో అత‌డికి బాగా తెలుసు. ఇంగ్లాండ్‌లోని ప‌రిస్థితుల్లో ఎలా ఆడాలో బ్యాట‌ర్లకు అవ‌గాహ‌న క‌ల్పించాలి. త‌ద్వారా వారి నుంచి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను రాబ‌ట్టాలి. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ ఫామ్‌లో లేక‌పోయినా గిల్‌, పుజారాలు మంచి ఫామ్‌లో ఉండ‌డం భార‌త జ‌ట్టుకు క‌లిసివ‌చ్చే అంశం. వీరిద్ద‌రితో పాటు హిట్‌మ్యాన్ కూడా ఫామ్ అందుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. టాప్‌-3 ఆట‌గాళ్లు రాణిస్తే ఆ త‌రువాత ప‌నిని విరాట్ కోహ్లి, అజింక్యా ర‌హానేలు చూసుకుంటారు.

Ajinkya Rahane: రూట్ మార్చిన ర‌హానే.. టెస్టుల‌ను కూడా టీ20లాగే..!

ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా డ‌బ్ల్యూటీసీ ట్రోఫిని గెలిచేందుకు ఇంత‌కంటే మంచి అవ‌కాశం ఉండ‌ద‌ని ప‌లువురు మాజీలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆస్ట్రేలియాను ఓడించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని అంటున్నారు. అయితే.. ఐదు రోజులు పాటు సాగే ఆట‌లో ఒక్క సెష‌న్‌లో విఫ‌లం అయినా మ్యాచ్ కోల్పోయే అవ‌కాశాలు ఉంటాయి. కాబ‌ట్టి ప్ర‌తీ సెష‌న్ లో ఆట‌గాళ్లు జాగ్ర‌త్త‌గా ఆడాల్సి ఉంటుంది.