WI Vs PAK : పాక్‌లో వెస్టిండీస్ టీం.. ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్

పాక్ - వెస్టెండీస్ జట్ల మధ్య మూడు టీ 20, మూడు వన్డేలు జరుగనున్నాయి. దీంతో వెస్టిండీస్ టీం పాక్ టూర్ కు వచ్చింది.

WI Vs PAK : పాక్‌లో వెస్టిండీస్ టీం.. ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్

Corona

West Indies Players For COVID-19 : కరోనా ఇంకా ప్రళయం సృష్టిస్తూనే ఉంది. ప్రపంచంలోని పలు దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తగ్గుముఖం పడుతుండడంతో స్కూళ్లు, పాఠశాలలు, ఆఫీసులు, ఇతరత్రా తెరుచుకున్నాయి. అలాగే..క్రికెట్ మ్యాచ్ లు కూడా జరుగుతున్నాయి. పలువురు క్రీడాకారులు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే…కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. తాజాగా…ముగ్గురు వెస్టిండీస్ ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. వీరితో పాటు..మేనేజ్ మెంట్ సభ్యుడికి కరోనా సోకినట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా…ఐసోలేషన్ లో ఉన్నారని వెస్టిండీస్ మేనేజ్ మెంట్ వెల్లడించింది.

Read More : AP Govt : జగన్ సర్కార్ కీలక నిర్ణయం, ఆ జిల్లాలో మహిళా రుణాలన్నీ మాఫీ

పాక్ – వెస్టెండీస్ జట్ల మధ్య మూడు టీ 20, మూడు వన్డేలు జరుగనున్నాయి. దీంతో వెస్టిండీస్ టీం పాక్ టూర్ కు వచ్చింది. సోమవారం నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. పాక్ కు చేరుకున్న అనంతరం క్రీడాకారులకు పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. వెస్టిండీస్ కు చెందిన ఆటగాళ్లు రోస్టన్ చేజ్, షెల్టన్ కాట్రెల్, కైల్ మేయర్స్ కు కరోనా వచ్చినట్లు నిర్ధారించారు. టీమ్ మేనేజ్ మెంట్ యూనిట్ లోని సభ్యుడికి కూడా పాజిటివ్ వచ్చింది. వీరంతా పాక్ సిరీస్ లో పాల్గొనేందుకు అందుబాటులో ఉండరు. ప్రస్తుతం వీరికి పెద్దగా కరోనా లక్షణాలు లేవని వెస్టిండీస్ మేనేజ్ మెంట్ టీమ్ పేర్కొంది. కరోనా సోకినా..టూర్ మాత్రం
కొనసాగుతుందని భావిస్తున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ CEO జానీ గ్రేవ్ వెల్లడిస్తున్నారు.