పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ ఉడ్స్

పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ ఉడ్స్

Tiger Woods

Tiger Woods : గోల్ప్ సూపర్ స్టార్ టైగర్ ఉడ్స్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. దీంతో ఆయన రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న బెలూన్ ఓపెన్ కావడంతో ఆయన ప్రాణాల నుంచి బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న క్రీడాభిమానులు షాక్ కు గురయ్యారు. ఆయన ఎలా ఉన్నారనే విషయంపై ఆరా తీశారు.

లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియాలో ఉడ్స్ కారులో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. అనేకసార్లు పల్టీలు కొడుతూ..చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఉడ్స్ కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న లాస్ ఏంజెల్స్ పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది అక్కడకు చేరుకొని ఉడ్స్‌ను కారు నుంచి బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు.

ఆయన రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. కాళ్లకు చికిత్స చేశారు. శస్త్ర చికిత్స విజయవంతమైందని లాస్ ఎంజెల్స్ కౌంటీ షెరీఫ్ అలెక్స్ విల్లానుయేవా వెల్లడించారు. 2009లో ఫ్లోరిడాలో కూడా ఉడ్స్‌ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఇక టైగర్ ఉడ్స్ విషయానికి వస్తే…48 ఏళ్ల వయస్సు గల..ఇతను…ఇప్పటి వరకు పిజిఎలో 82 టైటిళ్లు గెలిచాడు. 15 మేజర్‌ ఛాంపియన్‌షిప్‌లు సొంతం చేసుకున్నాడు. ఇందులో 5 మాస్టర్‌ టోర్నమెంట్‌లు కూడా ఉన్నాయి.