T20 World Cup 2021: అంచనాలకు అందని అంతర్జాతీయ టీ20 టోర్నీ ఆరంభం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ ముగిసిన రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ వేదికపై మరో మెగా సమరం ఆరంభం కానుంది.

T20 World Cup 2021: అంచనాలకు అందని అంతర్జాతీయ టీ20 టోర్నీ ఆరంభం

T20 World Cup

T20 World Cup 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ ముగిసిన రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ వేదికపై మరో మెగా సమరం ఆరంభం కానుంది. అక్టోబర్ 17 నుంచి మొదలుకానున్న వరల్డ్ కప్ టీ20కి ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. ఐదేళ్ల విరామం తర్వాత 16జట్లు హోరాహోరీగా తలపడేందుకు రెడీ అయ్యాయి.

ఈ టోర్నీలో తొలుత గ్రూప్‌-ఏ, గ్రూప్-బీలోని క్వాలిఫయర్స్‌ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జ‌రగనున్నాయి. ఆ తర్వాత ప్రధాన జట్ల మధ్య సూప‌ర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్‌ 23 నుంచి స్టార్ట్ అవుతాయి. తొలి రోజు ఒమన్‌ జట్టును పపువా న్యూ గినియా ఢీకొట్టనుంది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. స్కాట్లాండ్‌లు తలపడనున్నాయి.

గ్రూప్ ఏ – శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్ బీ – బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమన్

గ్రూపు ఒక జట్టు మిగిలిన జట్లతో ఓ మ్యాచ్‌లో తలపడుతుంది. అలా ముగిసిన తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్( సూపర్ 12)కు చేరుకుంటాయి. అక్కడ ఎనిమిది టాప్ రేంజ్ టీంలతో రెండింటిని కూడా కలిపి రెండు గ్రూపులుగా విభజిస్తారు.

……………………………………..: బిగ్ బాస్ లో ఆరో ఎలిమినేషన్.. శ్వేతా వర్మ అవుట్..

గ్రూప్ 1: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, A1, B2
గ్రూప్ 2: భారత్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, B1, A2

ప్రతి జట్టు గ్రూపులోని ఇతర జట్టుతో ఓ మ్యాచ్‌లో తలపడుతుంది. అలా రెండు గ్రూప్‌ల నుంచి టాప్ 2 స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌ దశలో గెలిచిన జట్టుకు రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. మ్యాచ్ టై అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.

డీఆర్ఎస్ ఎలా:
ఒక్క జట్టుకు ప్రతి ఇన్నింగ్స్ కు రెండు డీఆర్ఎస్ రిక్వెస్ట్ లు మాత్రమే ఉంటాయి.

డిఫెండింగ్ ఛాంపియన్లు వెస్టిండీస్, ఇండియాలతో ఆరంభంకానున్న మెగా టోుర్నీలో ఇంగ్లాండ్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. న్యూజిలాండ్, పాకిస్తాన్ లను కూడా అంత తేలిగ్గా తీసుకోలేం.

ప్రైజ్ మనీ:
ఛాంపియన్లకు 1.6మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వనుండగా.. రన్నరప్ లకు 8లక్షల డాలర్లు, సెమీఫైనల్స్ వరకూ చేరుకుంటే 4లక్షల డాలర్లు వస్తాయి.