IND vs NZ 3rd T20: సిరీస్ ఎవరిదో? నేడు ఇండియా వర్సెస్ కివీస్ టీ20 ఫైనల్ మ్యాచ్.. తుది జట్టులోకి పృథ్వీషా ..?

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. నేడు జరిగే మ్యాచ్ లో విజయం సాధించే జట్టు టీ20 సిరీస్‌ను దక్కించుకోనుంది.

IND vs NZ 3rd T20: సిరీస్ ఎవరిదో? నేడు ఇండియా వర్సెస్ కివీస్ టీ20 ఫైనల్ మ్యాచ్.. తుది జట్టులోకి పృథ్వీషా ..?

IND vs NZ T20 Match

IND vs NZ 3rd T20: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరుగ్గా మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, రెండో మ్యాచ్ టీమిండియా గెలుచుకొని 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి. ఈ రోజు రాత్రి 7గంటలకు జరిగే మ్యాచ్ ద్వారా సిరీస్ ఎవరిదో తేలిపోతుంది.  ఇప్పటికే వన్డే సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూసిన కివీస్ జట్టు టీ20 సిరీస్‌ను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత్ జట్టుసైతం నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించింది టీ20 సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తుంది.

IND vs NZ T20 Match: ఉత్కంఠ‌భ‌రిత పోరులో కివీస్‌పై టీమిండియా విజ‌యం.. ఫొటోలు

నేడు జరిగే టీ20 మ్యాచ్ లో భారత్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. గత రెండు మ్యాచ్ లలో ఓపెనింగ్ జోడీ విఫలమవుతూ వస్తుంది. వన్డేల్లో పరుగుల వరద పారించిన శుభ్‌మన్ గిల్ టీ20 మ్యాచ్ లలో రాణించలేక పోతున్నారు. రెండు మ్యాచ్ లలోనూ తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టాడు. మరోవైపు ఇషాన్ కిషన్ సైతం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలో గిల్ స్థానంలో పృథ్వీ షాను తుది జట్టులోకి తీసుకొనే ఆలోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంది. ఈ మేరకు కోచ్ రాహుల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్ చాహల్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో చేరే అవకాశం ఉంది. అర్ష్‌దీప్, శివమ్ మావితో కలిసి అతను పేస్ బాధ్యతలు పంచుకోవచ్చు.

IND vs NZ 3rd T20: రేపు ఇండియా వర్సెస్ కివీస్ మధ్య కీలక మ్యాచ్ .. తుది జట్టులోకి పృథ్వీ షా, జితేశ్ శ‌ర్మ‌ ..!

తొలి మ్యాచ్‌లో విజయం సాధించి, రెండో మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు పోరాడి ఓడిన న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు మూడో టీ20లో విజయంపై ధీమాతో ఉన్నారు. వన్డే సిరీస్‌కు ప్రతీకారంగా టీ20 సిరీస్‌ను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఆ జట్టు ఉంది. ఎలాంటి మార్పులు లేకుండానే కివీస్ జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.