IND vs PAK Women T20 WC: పాకిస్థాన్‌తో అమీతుమీకి సిద్ధమైన భారత్.. టీ20 ప్రపంచ కప్‌లో నేడు కీలక మ్యాచ్ ..

పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. అందుకు మరోసారి సమయం ఆసన్నమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌ను దక్షిణాఫ్రికా గడ్డపై నిర్వహిస్తున్న విషయం విధితమే. షెడ్యూల్‌లో భాగంగా ఆదివారం భారత మహిళా జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.

IND vs PAK Women T20 WC: పాకిస్థాన్‌తో అమీతుమీకి సిద్ధమైన భారత్.. టీ20 ప్రపంచ కప్‌లో నేడు కీలక మ్యాచ్ ..

IND vs PAK Match

IND vs PAK Women T20 WC: నాగ్‌పూర్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ముగిసింది. టీమిండియా స్పిన్ బౌలింగ్ ధాటికి ఆసీస్ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. ప్రపంచ క్రికెట్‌లో అన్నివిధాల బలమైన జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తుచేయడంతో భారత్‌లోని క్రికెట్ అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇదే క్రమంలో.. ఆదివారం కూడా కీలక పోరు జరగనుంది. టీ20 మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ భారత్ మహిళా జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. కేప్‌టౌన్ వేదికగా భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 6.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

India vs Australia: రోహిత్ సెంచరీ బాదిన వేళ.. ఆస్ట్రేలియా తీరును ఎత్తిపొడుస్తూ వసీం జాఫర్ వ్యాఖ్యలు

పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. అందుకు మరోసారి సమయం ఆసన్నమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌ను దక్షిణాఫ్రికా గడ్డపై నిర్వహిస్తున్న విషయం విధితమే. షెడ్యూల్‌లో భాగంగా ఆదివారం భారత మహిళా జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ఘన విజయం సాధించింది. ఈ ఉత్సాహంలో ఉన్న క్రికెట్ అభిమానులు.. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా సాయంత్రం జరిగే పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్‌కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

IND vs AUS 1st Test Match: తొలిటెస్టులో ఆసీస్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం .. మూడోరోజు ఆట ఫొటోలు

హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యంలో భారత మహిళా జట్టు పాక్‌తో తలపడనుంది. భారత జట్టు ఓపెనర్ పెఫాలీ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. బ్యాట్, బాల్‌తో ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌ను ప్రదర్శిస్తోంది. హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ ఆడితే భారత్ విజయం ఈజీ అవుతుంది. మరోవైపు ఆల్ రౌండర్ దీప్తి శర్మ, పాస్ట్ బౌలర్ శిఖా పాండే, స్పిన్నర్ జేశ్వరి గౌక్వాడ్‌లుకూడా రాణిస్తే పాకిస్థాన్ చిత్తు కావటం ఖాయంగా అభిమానులు అంచనా వేస్తున్నారు.

టీ20 ప్రపంచ కప్ – 2023 భారత్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్  ..

ఫిబ్రవరి 12 – భారత్ వర్సెస్ పాకిస్థాన్ (కేప్ టౌన్, సాయంత్రం 6.30 గంటలకు)
ఫిబ్రవరి 15 – వెస్టిండీస్ వర్సెస్ భారత్ (కేప్ టౌన్, సాయంత్రం 6.30 గంటలకు)
ఫిబ్రవరి 18 – ఇంగ్లండ్ వర్సెస్ భారత్ (ఫోర్ట్ ఎలిజబెత్, సాయంత్రం 6.30 గంటలకు)
ఫిబ్రవరి 20 – ఐర్లాండ్ వర్సెస్ భారత్ ( ఫోర్ట్ ఎలిజబెత్, సాయంత్రం 6. 30 గంటలకు)
ఫిబ్రవరి 23 – 1వ సెమీ-ఫైనల్, కేప్ టౌన్, సాయంత్రం 6.30
ఫిబ్రవరి 24 – 2వ సెమీ-ఫైనల్, కేప్ టౌన్, సాయంత్రం 6.30
ఫిబ్రవరి 26 – ఫైనల్ మ్యాచ్ కేప్ టౌన్, సాయంత్రం 6.30