IND vs NZ 1st T20 Match: నేడు ఇండియా వర్సెస్ కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిలో చాన్స్ ఎవరికో?

రాంచీలో ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్ లు జరిగాయి. వీటిల్లో 16 మ్యాచ్‌లలో రెండో దఫా బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావం ఉంటుంది.

IND vs NZ 1st T20 Match: నేడు ఇండియా వర్సెస్ కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిలో చాన్స్ ఎవరికో?

India vs New Zealand Match

IND vs NZ 1st T20 Match: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఇవాళ సాయత్రం జరుగుతుంది. రాంచీ వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. న్యూజిలాండ్‌పై జరిగిన మూడు వన్డేల్లో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు.. అదే ఊపుతో టీ20 సిరీస్‌లోను అద్భుత ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధమైంది. అయితే, టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ వంటి సీనియన్ ఆటగాళ్లు లేకుండా హార్ధిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా జట్టు బరిలోకి దిగుతుంది.

IND VS NZ T20 Series: టీ20 సిరీస్‌కు ముందు భారత్ జట్టుకు ఎదురుదెబ్బ.. గాయంతో కీలక ప్లేయర్ ఔట్?

వన్డేల్లో రోహిత్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడి అద్భుతంగా రాణించారు. టీ20 జట్టులో రోహిత్ లేకపోవటంతో గిల్‍‌తో ఎవరు జతకడతారనే విషయం ఆసక్తికరంగా మారింది. జట్టులోకి పునరాగమనం చేసిన పృథ్విషా ఓపెనర్ గా బరిలోకి దిగుతారని అందరూ భావించినప్పటికీ కెప్టెన్ హార్ధిక్ మాత్రం గిల్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని క్లారిటీ ఇచ్చారు. వీరితో పాటు రాహుల్ త్రిపాటి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా బ్యాటింగ్ లైనప్ తో టీమిండియా బలంగా ఉంది. అయితే బౌలింగ్ విభాగంలో షమీ, సిరాజుద్దీన్ ఇద్దరికి విశ్రాంతి లభించడంతో ప్రధాన బౌలర్ గా కెప్టెన్ హార్ధిక్ బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉంది. శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ కూడా పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్ విభాగంలో సందర్‌తో కలిసి చాహల్ ఆడతారా, కుల్‌దీప్‌కు అవకాశం దక్కుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. టీం మేనేజ్‍‌మెంట్ మాత్రం కుల్‌దీప్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Ind Vs NZ 3rd ODI : తిరుగులేని భారత్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

కివీస్ జట్టు విషయానికొస్తే.. వన్డే సిరీస్‌లో వరుస మ్యాచ్‌లలో ఓటమి పాలైన ఆ జట్టు టీ20 సిరీస్ లో నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తుంది. కీలక ఆటగాళ్లు విలియమ్సన్ , సౌథీ లేకుండా శాంట్నర్ సారథ్యంలో ఆ జట్టు బరిలోకి దిగనుంది. రాంచీలో ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్ లు జరిగాయి. వీటిల్లో 16 మ్యాచ్‌లలో రెండో దఫా బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది.