India vs South Africa Match: నేడు దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండో టీ20 మ్యాచ్.. జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికీ మరోసారి చోటు దక్కుతుందా?

మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రాత్రి గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

India vs South Africa Match: నేడు దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండో టీ20 మ్యాచ్.. జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికీ మరోసారి చోటు దక్కుతుందా?

India vs South Africa Match

India vs South Africa Match: మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన రోహిత్ నేతృత్వంలోని టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ దక్కించుకోవచ్చు. అయితే దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి స్కోర్ ను సమం చేసేందుకు పట్టుదలతో ఉంది.

India vs South Africa T20 series: స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్ బుమ్రా స్థానంలో టీమిండియాలోకి సిరాజ్

గౌహతిలో భారత జట్టు ఒక్క టీ20నే ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 118పరుగులకే కుప్పకూలింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు ఇవాళ సాయత్రం జరిగే మ్యాచ్‍కు వరుణుడి గండం పొంచింఉంది.  గుహవాటికలోని పిచ్ మాత్రం బౌలర్లకు, ముఖ్యంగా పేసర్లకు అనుకూలిస్తుంది. బ్యాట్స్ మెన్ క్రిజ్ లో కుదురుకుంటే పరుగులు చేయొచ్చే. అయితే, భారీ స్కార్లకు అవకాశం ఈ గ్రౌండ్‌లో చాలా తక్కువ.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

భారత్ బ్యాట్స్ మెన్ ఇప్పుడిప్పుడే ఫాంలోకి వస్తున్నారు. కోహ్లీ, రోహిత్, సురేష్ యాదవ్, రాహుల్ లాంటి బ్యాట్స్ మెన్‌ఫామ్‌లోకి వచ్చారు. ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో హార్థిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. దీంతో టీమిండియాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందనే చెప్పొచ్చు. తొలి టీ20లో ఇద్దరు వికెట్ కీపర్లు పంత్, దినేష్ కార్తీలను తుదిజట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ లోనూ వారిద్దరిని ఆడిస్తారా? లేక వేరే ఫేసర్‌ను బరిలోకి దింపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గాయాల కారణంగా జడేజా పక్కకు వెళ్లిపోయాడు. తాజాగా బూమ్రా గాయంతో వైదొలిగాడు. దీంతో బౌలింగ్ విభాగంలో భారత్ కొంచెం బలహీనంగానే ఉందని చెప్పొచ్చు. పంత్, కార్తీక్ లలో ఒక్కరిని మాత్రమే తుదిజట్టులో ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. మరొకరి స్థానంలో ఆరవ బౌలర్ ను తీసుకొనేందుకు రోహిత్ ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది.