Women T20 World Cup Final: సఫారీలు చరిత్ర సృష్టిస్తారా..! మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. ఆసీస్‌ను ఢీకొట్టనున్న దక్షిణాఫ్రికా

టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఏడుసార్లు ఫైనల్‌కు చేరింది. వీటిల్లో అయిదు సార్లు కప్‌ను కైవసంచేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ద్వారా ఆరోసారి విజేతగా నిలిచేందుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.

Women T20 World Cup Final: సఫారీలు చరిత్ర సృష్టిస్తారా..! మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. ఆసీస్‌ను ఢీకొట్టనున్న దక్షిణాఫ్రికా

South Africa vs Australia Teams

Women T20 World Cup Final: థ్రిల్లింగ్ విక్టరీతో దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్ మ్యాచ్ ఇవాళ సాయంత్రం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) జరుగుతుంది. ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా జట్టును దక్షిణాఫ్రికా ఢీకొట్టనుంది. అతిథ్య దక్షిణాఫ్రికా జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్‌లో మెన్స్, ఉమెన్స్ జట్లు విజయం సాధించలేదు. తొలిసారి ఉమెన్స్ జట్టు టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంటుందని ఆ దేశ క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్‌లో ఆసీస్, దక్షిణాఫ్రికా మధ్య ఆరు మ్యాచ్ లు జరిగాయి. వీటన్నింటిల్లోనూ ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్ పోరులో ఆసీస్‌పై విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించేందుకు సఫారీసేన సిద్ధమైంది.

IND vs AUS Womens Semifinal: టీ20 ప్రపంచ కప్‌లో కీలక మ్యాచ్.. సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న భారత్

టీ20 ప్రపంచ కప్‌లలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఏడుసార్లు ఫైనల్‌కు చేరింది. వీటిల్లో అయిదు సార్లు కప్‌ను కైవసంచేసుకుంది. గతేడాది భారత్ జట్టు పై గెలిచిన ఆసీస్ ఐదోసారి టీ20 ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ద్వారా ఆరోసారి విజేతగా నిలిచేందుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. బలమైన ఆసీస్ జట్టును ఓడించడం సఫారీ సేనకు కష్టమే. అందులోనూ, ప్రస్తుత టోర్నీలో ఆసీస్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆ జట్టు క్రీడాకారిణులు సూపర్ ఫామ్‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితితుల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే అద్భుత ప్రతిభను కనబర్చాల్సిందే.  సమిష్టిగా రాణిస్తే ఆస్ట్రేలియాపై విజయం సాధించటం సఫారీ సేనకు అంతకష్టమేమీ కాదన్న భావనను దక్షిణాఫ్రికా మాజీలు పేర్కొంటున్నారు.

 

ఇంగ్లాండ్ తో సెమీస్ లో పోరాట స్ఫూర్తితో విజయం సాధించిన సఫారీ సేన.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే మరింత గొప్పగా రాణించాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా ఫైనల్ పోరులో విజయం సాధిస్తే.. పురుషులు, మహిళల జట్టులో తొలిసారి ప్రపంచ కప్ టైటిల్ నెగ్గిన జట్టుగా నిలుస్తుంది.

 

 

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు  అంచనా ..

ఆస్ట్రేలియా:

అలిస్సా హీలీ, బెత్‌ మూనీ, మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), ఆష్లే గార్డ్‌నర్‌, ఎల్లీస్‌ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్‌, గ్రేస్‌, జార్జియా వేర్హమ్‌, జెస్‌ జొనాసెన్‌, మేగన్‌ స్కట్‌, డార్సీ బ్రౌన్‌.

సౌతాఫ్రికా:

తజ్మీన్‌ బ్రిట్స్‌, లారా, మరిజన్నే కాప్‌, సునె లుస్‌ (కెప్టెన్‌), చ్లో ట్రయాన్‌, బాష్‌, నడైన్‌ డి క్లర్క్‌, సినాలో జాఫ్టా, షబ్నిం ఇస్మాయిల్‌, అయోబంగ ఖకా, మ్లబా.