Tokyo Olympic : శృంగారం చేస్తే మంచాలు విరిగిపోతాయా ? యాంటీ సెక్స్ బెడ్స్ అవాస్తవం!

టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల నుంచి క్రీడాకారులు ఒలింపిక్ గ్రామానికి చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాలని ఒలింపిక్ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. వచ్చిన వారికి ఒలింపిక్ విలేజ్ లోని అపార్ట్ మెంట్ లలో రూమ్స్ కేటాయిస్తున్నారు. అయితే..బెడ్స్ విషయంలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

Tokyo Olympic : శృంగారం చేస్తే మంచాలు విరిగిపోతాయా ? యాంటీ సెక్స్ బెడ్స్ అవాస్తవం!

Tokyo 2021

‘Anti-Sex’ Report :  టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల నుంచి క్రీడాకారులు ఒలింపిక్ గ్రామానికి చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాలని ఒలింపిక్ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. వచ్చిన వారికి ఒలింపిక్ విలేజ్ లోని అపార్ట్ మెంట్ లలో రూమ్స్ కేటాయిస్తున్నారు. అయితే..బెడ్స్ విషయంలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. గదుల్లో ఉన్న బెడ్స్ యాంటీ సెక్స్ అంటూ తెగ ప్రచారం అవుతోంది.

కరోనా కారణంగా…క్రీడాకారులు ఒకరితో ఒకరు కలవకుండా ఉండేందుకు…శృంగారం కార్యకలాపాల్లో పాల్గొనకుండా తక్కువ సామర్థ్యం ఉన్న..మంచాలను సిద్ధం చేశారంటూ..ఓ ఆటగాడు..ట్వీట్ చేయడంతో ‘యాంటీ సెక్స్ బెడ్స్’ అంటూ ఫుల్ ప్రచారం జరిగింది. దీంతో దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. దీనిపై ఐర్లాండ్ జిమ్నాస్ట్ క్రీడాకారుడు రిస్ మెక్ క్లెనఘన్ స్పందించారు. బెడ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయంటూ..ఓ వీడియో తీసి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. యాంటీ సెక్స్ బెడ్స్ కావని స్పష్టం చేస్తున్నాడు.

ఆ బెడ్ పై పైకి కిందకు ఎగిరి చూపించాడు. బెడ్స్ విరిగిపోతాయని అంటున్నారని, కానీ ఇవి ఏ మాత్రం విరగడం లేదని వీడియోలో చెప్పుకొచ్చాడు. మెక్లీగన్ పెట్టిన వీడియోకు ఒలింపిక్ నిర్వాహక కమిటీ స్పందించింది. ఒక నమ్మకాన్ని బ్రేక్ చేసినందుకు థాంక్స్ చెప్పింది. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.