Tokyo Olympics: ఇండియాకు ఆరో పతకం.. రెజ్లింగ్‌లో పూనియాకు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఆరో పతకం వచ్చి చేరింది. రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 65కేజీల విభాగంలో కాంస్యం సాధించాడు హర్యానాకు చెందిన భజరంగ్ పూనియా. కజకిస్తాన్ కు చెందిన డౌలెట్ నియాజ్‌బెకోవ్ పై 8-0తేడాతో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

Tokyo Olympics: ఇండియాకు ఆరో పతకం.. రెజ్లింగ్‌లో పూనియాకు కాంస్యం

Bajarang Punia (1)

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఆరో పతకం వచ్చి చేరింది. రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 65కేజీల విభాగంలో కాంస్యం సాధించాడు హర్యానాకు చెందిన భజరంగ్ పూనియా. కజకిస్తాన్ కు చెందిన డౌలెట్ నియాజ్‌బెకోవ్ పై 8-0తేడాతో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ప్రపంచ చాంపియన్‌ అజ‌ర్‌బైజాన్ రెజ్ల‌ర్ హ‌జి అలియేవ్‌తో జ‌రిగిన సెమీస్ బౌట్‌లో భజరంగ్‌ 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. కాగా సెమీస్‌లో ఓడిన భజరంగ్‌ పట్టుదలతో కాంస్య పతక పోరులో గెలిచాడు. మోకాలి గాయం ఇబ్బంది పెట్టడంతో శుక్రవారం మ్యాచ్ లో రాణించలేకపోయాడని అతని తండ్రి వెల్లడించారు.

రెండ్రోజుల ముందు జరిగిన బౌట్ లో.. రవి దాహియాకు కాంస్యమే దక్కింది. గోల్డ్ మెడల్ సాధిస్తాడనుకున్న రవి దహియా ఫైనల్ లో ఓడిపోయాడు. అయినా రజతంతో మెరిశాడు. రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైన‌ల్ లో ఓడినా.. భారత్ కు రజతాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్ లో రష్యాకి చెందిన జౌర్ ఉగేవ్ చేతిలో 4-7తో ఓడినా పతకం దక్కింది.