కరోనా ఎఫెక్ట్ : ఏడాది పాటు టోక్యో ఒలంపిక్స్ వాయిదా

కరోనా ఎఫెక్ట్ : ఏడాది పాటు టోక్యో ఒలంపిక్స్ వాయిదా

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒలిపింక్స్‌కు కూడా సోకింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్‌ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

టోక్సో ఒలంపిక్స్ ను ఏడాది పాటు వాయిదా పడ్డాయి. ఒలంపిక్స్ ను 2021వరకు వాయిదా వాసే తీర్మాణానికి ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ(IOC) అధ్యక్షుడు థామస్ బాచ్ 100శాతం ఆమోదం తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒలంపిక్స్ ను వాయిదా వేయాలని తాను కోరానని బాచ్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత జపాన్ ప్రధాని షింజో అబే సోమవారం చెప్పిన విషయం తెలిసిందే. ఒలంపిక్స్ నుచ రీషెడ్యూల్ చేయడం కరోనా వైరస్ మహమ్మారిపై మానవ విజయానికి ఫ్రూఫ్ గా ఉంటుందని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు అబే తెలిపారు. రాబోయే నాలుగు వారాల్లో ఒలంపిక్స్ పై నిర్ణయం తీసుకుంటామని IOC ప్రెసిడెంట్ రెండు రోజుల క్రితం ప్రకటించిన తర్వాత షింజో అబో IOC ప్రెసిడెంట్ తో ఫోన్ లో మాట్లాడారు.