Ravi Kumar Dahiya: ఒలింపిక్స్‌లో రవి పంచ్.. పతకం ఖాయం.. ఫైనల్‌కు దహియా

టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ సెమీ ఫైనల్స్‌లో 57 కేజీల బరువు విభాగంలో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు భారత రెజ్లర్ రవి దహియా.

Ravi Kumar Dahiya: ఒలింపిక్స్‌లో రవి పంచ్.. పతకం ఖాయం.. ఫైనల్‌కు దహియా

Ravi Dahia

Olympic Games Tokyo 2020: టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ సెమీ ఫైనల్స్‌లో 57 కేజీల బరువు విభాగంలో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు భారత రెజ్లర్ రవి దహియా. తద్వారా భారతదేశానికి ఒక పతకం పిక్స్ అయ్యింది. భారత రెజ్లర్ రవి కుమార్ టోక్యో ఒలింపిక్స్‌లో బుధవారం జరిగిన పురుషుల ఫ్రీస్టైల్ 57 కిలోల విభాగంలో సెమీ ఫైనల్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన సానాయేవ్ నూరిస్లామ్‌ని ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు.

దీంతో దేశానికి కచ్చితంగా ఒక పతకం దక్కనుంది. ఫైనల్‌లో కూడా గెలిచి రవి దేశానికి బంగారు పతకం తీసుకుని రావాలని ఆశిస్తున్నారు. భారత కుస్తీ వీరుడు రవి కుమార్ దహియా ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. రవికుమార్‌ గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. వరుసగా రెండో బౌట్లోనూ ప్రత్యర్థి ఆటకట్టించాడు.

ఒలింపిక్స్‌లో భారత రెజర్లు దుమ్ములేపుతుండగా.. 57 కేజీల పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో బల్గేరియా ఆటగాడు జియోర్గి వంగెలోవ్‌ను 4-14 తేడాతో ఓడించి భారత స్టార్ రెజ్లర్ రవి దహియా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. ఇవాళ(04 ఆగస్ట్ 2021) జరిగిన ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. చరిత్రను తిరగరాస్తూ రవికుమార్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల 57 కిలోల విభాగంలో రవికుమార్‌ విక్టరీ సాధించాడు.

2008, 2012, 2016 ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో భారత్‌కు రెజ్లింగ్‌లో పతకాలు దక్కాయి. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ కుమార్‌కు కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌కు రజతం, యోగేశ్వర్‌కు కాంస్యం, 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్‌ కాంస్య పతకం, 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో కేడీ జాదవ్‌కు కాంస్యం, స్వాతంత్య్రం వచ్చాక దేశానికి తొలి వ్యక్తిగత పతకం అందించిన విభాగం రెజ్లింగే.