Tokyo Olympics 2020: సెమీ ఫైనల్‌లోకి రెజ్లర్లు దీపక్ పూనియా, రవి దాహియా

ఇండియన్ రెజ్లర్లు మెగా ఈవెంట్ అయిన టోక్యో ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయారు. బల్గేరియాకు చెందిన జార్జి వాంగెలొవ్ మీద 14-4తేడాతో గెలిచాడు రవి దాహియా. ఫ్రీ స్టైల్ 57కేజీల కేటగిరీలో 1/4వ స్థానంలో ఫైనల్ కు చేరుకున్నాడు.

Tokyo Olympics 2020: సెమీ ఫైనల్‌లోకి రెజ్లర్లు దీపక్ పూనియా, రవి దాహియా

New Project (3)

Tokyo Olympics 2020: ఇండియన్ రెజ్లర్లు మెగా ఈవెంట్ అయిన టోక్యో ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయారు. బల్గేరియాకు చెందిన జార్జి వాంగెలొవ్ మీద 14-4తేడాతో గెలిచాడు రవి దాహియా. ఫ్రీ స్టైల్ 57కేజీల కేటగిరీలో 1/4వ స్థానంలో ఫైనల్ కు చేరుకున్నాడు. మరో వైపు దీపక్ పూనియా సైతం 86కేజీల కేటగిరీలో చైనాకు చెందిన జూషెన్ లిన్ పై 6-3తేడాతో గెలిచి 1/4వ స్థానంలో సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించాడు.

మహిళల రెజ్లింగ్ లో భారత రెజ్లర్ అన్షు మాలిక్ బెలారస్ ప్లేయర్ ఇరీనా కురచ్కీనాతో 2-8తేడాతో ఓడిపోయింది.

అంతకంటే ముందు ఇండియా ప్లేయర్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో ఫైనల్ కు అర్హత సాధించారు. 86.65మీటర్లు విసిరి గ్రూప్ ఏలో టాప్ ఏగా నిలిచారు. ఇండియాకు చెందిన శివ్ పాల్ సింగ్ 74.81మీటర్లు తన మూడో అటెంప్ట్ లో విసిరగలిగారు. మొదటి రెండు సార్లు 76.40, 74.80మీటర్ల దూరం విసిరి ఫైనల్ కు క్వాలిఫై కాలేకపోయారు.