Tokyo Olympics : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనే మ్యాచ్‌‌లు

ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారులు తీవ్ర నిరాశకు గురి చేశారు. షూటింగ్ బృందంలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్ ను 10 మీటర్ల ఎయిర్ పిస్ట్ ఈవెంట్లో దురదృష్టం వెన్నాడింది. ఫైనల్ బెర్తు చేజారింది.

Tokyo Olympics : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనే మ్యాచ్‌‌లు

India 2021

Olympics India Schedule : ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారులు తీవ్ర నిరాశకు గురి చేశారు. షూటింగ్ బృందంలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్ ను 10 మీటర్ల ఎయిర్ పిస్ట్ ఈవెంట్లో దురదృష్టం వెన్నాడింది. ఫైనల్ బెర్తు చేజారింది. ఇక పి.వి. సింధు ఘనంగా ప్రారంభించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూపు జె పోరులో ఆరో సీడ్ సింధు 21-7, 21-10తో 58వ ర్యాంకర్ సెనియా పొలికర్బోవా (ఇజ్రాయిల్)పై గెలుపొందారు. భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ తొలి అడుగు వేశారు. మహిళల 51 కిలోల తొలి రౌండ్లో ఆమె 4-1తో హెర్నాండెజ్ గర్సియా (డొమినికా) ను ఓడించారు.

Read More : India Vs Sri lanka : తొలి టీ20లో శ్రీలంకపై భారత్ విజయం

టెన్నిస్ : పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ (సుమిత్ నగాల్) ఉదయం 9.30 గంటల నుంచి.
ఫెన్సింగ్ : మహిళల వ్యక్తిగత సాబ్రూ (భవానీ దేవి) ఉదయం 5.30 గంటల నుంచి. సోమవారం ఫైనల్ మ్యాచ్.
అర్చరీ : పురుషుల జట్టు (అతాను తరుణ్ దీప్, ప్రవీణ్) క్వాలిఫికేషన్ ఉదయం 6 నుంచి. ఫైనల్ మధ్యాహ్నం 12.45 గంటల నుంచి.

Read More :UP Elections : ఎస్పీతో పొత్తును తోసిపుచ్చిన ఎంఐఎం

బాక్సింగ్ : పురుషుల 75 కేజీలు (ఆశీష్ కుమార్) మధ్యాహ్నం 3.06 గంటల నుంచి.
టేబుల్ టెన్నిస్ : పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ (శరత్ కమల్) ఉదయం 6.30 గంటల నుంచి. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ (సుతీర్థ) ఉదయం 8.30 గంటల నుంచి. మూడో రౌండ్ (మనిక) మధ్యాహ్నం 12 నుంచి.
స్విమ్మింగ్ : పురుషుల 200 మీటర్లు. బటర్ ఫ్లై (సాజన్ ప్రకాశ్) మధ్యాహ్నం 3.50గంటల నుంచి.

Read More : రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

బ్యాడ్మింటెన్ : పురుషుల డబుల్స్ (సాత్విక్ – చిరాగ్) ఉదయం 9.10 గంటల నుంచి.
షూటింగ్ : పురుషులు (అహ్మద్, అంగద్). క్వాలిఫికేషన్ ఉదయం 6.30 గంటల నుంచి ఫైనల్ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి.
హాకీ : మహిళలు గ్రూప్ ఏ (భారత్ – జర్మనీ) సాయంత్రం 5.45గంటల నుంచి.
సెయిలింగ్ : పురుషుల లేజర్ (విష్ణు) ఉదయం 8.35 నుంచి. మహిళల లేజర్ రేడియల్ (నేత్ర) 11.05 గంటల నుంచి.