Tokyo Olympics 2021: వినేశ్ ఫోగట్‌ను టోక్యోకు వెళ్లకుండా అడ్డుకున్న అధికారులు

స్టార్ ఫైటర్.. ఇండియన్ రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగట్ టోక్యో ఒలింపిక్స్ వెళ్లకుండా ఆపేశారు అధికారులు. యురోపియన్ యూనియన్ (EU) వీసా మీద ట్రైనింగ్ కోసం వెళ్లిన ఆమె ఒకరోజు ఎక్కువగా ఉందనే నెపంతో అడ్డుకున్నారు.

Tokyo Olympics 2021: వినేశ్ ఫోగట్‌ను టోక్యోకు వెళ్లకుండా అడ్డుకున్న అధికారులు

Vinesh Phogat

Tokyo Olympics 2021: స్టార్ ఫైటర్.. ఇండియన్ రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగట్ టోక్యో ఒలింపిక్స్ వెళ్లకుండా ఆపేశారు అధికారులు. యురోపియన్ యూనియన్ (EU) వీసా మీద ట్రైనింగ్ కోసం వెళ్లిన ఆమె ఒకరోజు ఎక్కువగా ఉందనే నెపంతో అడ్డుకున్నారు. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ లలో ఎన్నో పతకాలు గెలిచిన ఈ 26ఏళ్ల ఛాంపియన్ ఇండియాకు మెగా ఈవెంట్ లో పతకం తీసుకొస్తుందని భావించిన వారిలో ఆందోళన మొదలైంది.

దీనిపై ఐఓఏ అధికారి స్పందించారు. 90 రోజులు ఉండటానికి తీసుకున్న Schengen వీసా ఒకరోజు ఎక్కువగా ఉందనేది కావాలని చేసింది కాదని వివరించారు. Budapestనుంచి Frankfurt ల్యాండ్ అయ్యాక ఎయిర్ పోర్టు అధికారులు టోక్యోకు వెళ్లాల్సిన విమానం ఎక్కనీయకుండా అడ్డుకున్నారు.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈ మేటర్ చేరడంతో.. ఇండియన్ కాన్సులేట్ ను అలర్ట్ చేసింది. ఎయిర్ పోర్టుకు చేరి వినేశ్ ను ఎట్టి పరిస్థితుల్లో రేపటికల్లా టోక్యోకు పంపిస్తామని హామీ ఇచ్చారు.

టోక్యో ఒలింపిక్స్ కోసం హంగేరీలో తన కోచ్ వోలర్ అకోస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఫోగట్. కాకపోతే ఫ్రాంక్‌ఫోర్ట్ ఎయిర్ పోర్టుకు రాగానే ఆపేయడం టోక్యోకు చేరుకోవడం కుదరలేదు. కొద్ది రోజుల ముందు గేమ్స్ కు వెళ్లడానికి తమతో పాటు ఫిజియోను కూడా అనుమతించాలని కోరారు వినేశ్.

వినేశ్ సామర్థ్యాన్ని బట్టి 53 కేజీల ఉమెన్ ఫ్రీస్టైల్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించగలదనే నమ్మకం కనిపిస్తుంది. ఆగష్టు 5 నుంచి కాంపిటీషన్ లో కనిపిస్తారు వినేశ్. ఆమె చాలా సుపీరియర్ రెజ్లర్ అని.. కౌంటర్ అటాక్ చేయగలదని కోచ్, నిపుణులు భావిస్తున్నారు.