Tokyo Olympics 2020: లవ్లీనా గెలవాలనే ప్రార్థనల్లో పాల్గొన్న అస్సాం సీఎం

టోక్యో ఒలింపిక్స్ వేదికగా విజయాలతో దూసుకెళ్తున్న అస్సాంకు 24ఏళ్ల బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం సీఎం డా. హిమంత బిశ్వ శర్మ సైతం పాల్గొనడం విశేషం. ఇండియన్ బాక్సర్ గెలవాలని కొవ్వొత్తులు వెలిగించి రాధా గోవిందా బారౌ ముందు నిల్చొని ప్రార్థనలు చేశారు.

Tokyo Olympics 2020: లవ్లీనా గెలవాలనే ప్రార్థనల్లో పాల్గొన్న అస్సాం సీఎం

Lovlina Borgaiihn

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ వేదికగా విజయాలతో దూసుకెళ్తున్న అస్సాంకు 24ఏళ్ల బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం సీఎం డా. హిమంత బిశ్వ శర్మ సైతం పాల్గొనడం విశేషం. ఇండియన్ బాక్సర్ గెలవాలని కొవ్వొత్తులు వెలిగించి రాధా గోవిందా బారౌ ముందు నిల్చొని ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా ఆమె గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలంటూ సూచించారు సీఎం.

సీఎంతో పాటుగా స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ మినిష్టర్ బిమల్ బోరా, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిష్టర్ పీజూష్ హజారికా, అర్బన్ డెవలప్మెంట్ మినిష్టర్ అశోక్ సింఘాల్, రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిష్టర్ జోగెన్ మోహన్ తో పాటు పలువురు అస్సాం ఒలింపిక్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ కార్యక్రమానికి హాజరయ్యారు.

పతకం ఖాయం:
125ఏళ్ల చరిత్ర ఉన్న ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్ మ్యాచ్ బుధవారం ఆడనున్నారు లవ్లీనా. 69 కిలోల విభాగంలో సత్తా చాటిన..ఆమె క్వార్టర్స్ పోరులో చైనీస్‌ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్లే ఆమె… దురదృష్టవశాత్తు ఓడినా కాంస్యం దక్కుతుంది.

మ్యాచ్ కోసం అసెంబ్లీ వాయిదా:
సెమీఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను అస్సాం ప్రభుత్వం 30 నిమిషాలపాటు వాయిదా వేసే ఆలోచనలో ఉంది. లవ్లీనా బుధవారం టర్కీకి చెందిన ప్రపంచ ఛాంపియన్‌ బుసెనాజ్‌ సుర్మెనెలితో తలపడనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాలను ఉదయం 11 గంటల నుంచి 30 నిమిషాలపాటు వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.