Tokyo Olympics 2020: కాంస్య పతకం సాధించిన లవ్లీనా

అస్సాం బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌ టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యాన్ని గెలుచుకున్నారు. కరోనాను జయించి మెగా టోర్నీలో సత్తా చాటిన లవ్లీనా.. సెమీ ఫైనల్స్ లో ఓటమికి గురయ్యారు. 64-69 కేజీల కేటగిరీలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ తో తలపడి పరాజయానికి గురయ్యారు.

Tokyo Olympics 2020: కాంస్య పతకం సాధించిన లవ్లీనా

Lovlina Borgaiihn (1)

Tokyo Olympics 2020: ఇండియన్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌ టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యాన్ని గెలుచుకున్నారు. కరోనాను జయించి మెగా టోర్నీలో సత్తా చాటిన అస్సాంకు చెందిన లవ్లీనా.. సెమీ ఫైనల్స్ లో ఓటమికి గురయ్యారు. 64-69 కేజీల కేటగిరీలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ తో తలపడి పరాజయానికి గురయ్యారు.

మూడో రౌండ్ లో రాణించలేకపోయిన లవ్లీనా… వరల్డ్ ఛాంపియన్ గా నిలవలేకపోయారు. క్వార్టర్ ఫైనల్-2లో చైనా తైపీకి చెందిన బాక్సర్ చెన్ నియెన్-చిన్ మీద 4-1 తేడాతో విజయం సాధించింది. లవ్లీనా ఒలింపిక్స్‌లో ఆడటం ఇదే తొలిసారైనా భయపడలేదు. అదిరిపోయే పంచులతో క్వార్టర్స్‌ వరకు చేరింది. క్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌, చైనీస్‌ తైపీ బాక్సర్‌ నిన్‌-చిన్‌తో తలపడింది. 4-1 స్కోరుతో ఘన విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది.

బాక్సింగ్ లో మెడల్ గెలుచుకున్న మూడో ప్లేయర్ గా నిలిచారు లవ్లీనా. అంతకంటే ముందు విజేందర్ సింగ్, మేరీ కోమ్ ఈ జాబితాలో ఉన్నారు.