Tokyo Olympics: పోటీకి రెండ్రోజుల ముందు నుంచి ఏం తినలేదు – మీరాబాయి ఛాను

ఇండియా ఒలింపిక్ సిల్వర్ మెడల్ విన్నర్ మీరాబాయి చాను పోటీకి ముందు రెండ్రోజుల పాటు ఏం తినలేదట. బరువు పెరిగితే ఎక్కడ కాంపిటీషన్ కు దూరమవుతానో అని భయమేసి అలా చేశానని ఆమె అన్నారు.

Tokyo Olympics: పోటీకి రెండ్రోజుల ముందు నుంచి ఏం తినలేదు – మీరాబాయి ఛాను

Mirabhai Chanu

Tokyo Olympics: ఇండియా ఒలింపిక్ సిల్వర్ మెడల్ విన్నర్ మీరాబాయి చాను పోటీకి ముందు రెండ్రోజుల పాటు ఏం తినలేదట. బరువు పెరిగితే ఎక్కడ కాంపిటీషన్ కు దూరమవుతానో అని భయమేసి అలా చేశానని ఆమె అన్నారు. జులై 24న మహిళల 49కేజీల విభాగం వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో చాను వెండి పతకం పట్టేశారు.

49కేజీల విభాగంలో ఉండాలని తాను పడిన శ్రమను ఇలా చెప్పారు మీరాబాయి. బరువును ఒకేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. మన డైట్ ను స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేసుకోవాలి. జంక్ ఫుడ్ తినలేదు. తక్కువ మొత్తంలోనే మాంసం, పప్పులు మొదలైనవి తీసుకున్నా’ అని మీరాబాయి అంటున్నారు.

రియో ఒలింపిక్స్ తర్వాత తాను ఇండియా తరపున ఆడి గోల్డ్ మెడల్ తీసుకురావాలనే అనుకున్నారట. ఆ పట్టుదలే తనను టోక్యో ఒలింపిక్స్ వరకూ చేర్చిందని అన్నారు. ‘పతకం గెలుచుకోవాలనే కాన్ఫిడెన్స్ రియో ఒలింపిక్స్ నుంచే వచ్చింది. రియో గేమ్స్ లో అసంతృప్తి తర్వాత రాబోయే కాంపిటీషన్ కు మెడల్ కచ్చితంగా గెలుచుకోవాలని ఫిక్స్ అయ్యా. ఏదైనా నా బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ ఇస్తేనే వస్తుందని నాకు తెలుసు.

నా కోచ్ విజయ్ శర్మ నన్ను చాలా మోటివేట్ చేశారు. రియోలో జరిగిన దానిని మరచిపోవాలని భవిష్యత్ మీద ఫోకస్ పెట్టాలని అన్నారు. అతని వల్లనే నేనిక్కడ వరకూ రాగలిగాను.

లాక్ డౌన్ రిలాక్స్ అయిన తర్వాతే ప్రిపరేషన్ మొదలుపెట్టా. గాయాలు కావడంతో చాలా కాలం రెస్ట్ తీసుకుని తర్వాతనే మొదలుపెట్టా. గతేడాది అక్టోబరులో యూఎస్ఏ వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. అక్కడ తీసుకున్న 20రోజుల ట్రైనింగ్ బాగా హెల్ప్ అయింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ లోనూ రికార్డ్ బ్రేక్ చేశా. యూఎస్ఏలో గడిపిన సమయం ట్రైనింగ్ కు బాగా హెల్ప్ అయిందని మీరాబాయి చెప్పారు.