Tokyo Olympics : ఒలింపిక్ హాకీ, మహిళలు అదరగొట్టారు

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాపై గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. 4-3 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచింది. మొదటి నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి.

Tokyo Olympics : ఒలింపిక్ హాకీ, మహిళలు అదరగొట్టారు

Indian Women

Indian Women’s Hockey:  తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాపై గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. 4-3 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచింది. మొదటి నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఇరుజట్లు 2-2 గోల్స్‌తో నిలిచాయి. థర్డ్ క్వార్టర్స్‌లో కూడా 3-3 గోల్స్‌తో సమానంగా ఉన్నాయి. అయితే ఫోర్త్ క్వార్టర్‌లో వందనా కటారియా గోల్ చేయడంతో భారత్ 4 గోల్స్‌ను సాధించి 4-3 లీడ్‌తో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌ మొత్తానికి వందనా కటారియా హైలెట్‌గా నిలిచింది. ఏకంగా హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టి భారత్‌ విజయంలో కీ రోల్ ప్లే చేసింది.

Read More : Sarkaru Vaari Paata : ఆడియోతోనే అదిరిపోయే రికార్డ్..!

మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగడం విశేషం. ఆట ముగిసేలోపూ..భారత డిఫెన్స్ టీమ్ సౌతాఫ్రికాను మరో గోల్ చేయకుండా…నిలువరించారు. భారత్ విజయంతో లీగ్ దశల్లో ఐదు మ్యాచ్ ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో కలిపి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ క్వార్టర్స్ చేయాలంటే…ఐర్లాండ్ – గ్రేట్ బ్రిటన్ మధ్య జరగనున్న మ్యాచ్ లో ఐర్లాండ్ ఓడిపోవాలి. లేదా మ్యాచ్ డ్రా అయినా భారత్ క్వార్టర్స్ కు క్వాలిఫై అవుతుంది. ఐర్లాండ్ గెలిస్తే…మాత్రం భారత మహిళల జట్టు ఇంటిముఖం పడుతుంది.