Olympics 2021 : ఒలింపిక్స్ పై జపాన్ లో వ్యతిరేకత

మెగా క్రీడలైన ఒలింపిక్స్‌పై జపాన్‌లో వ్యతిరేకత రోజు రోజుకు అధికమవుతోంది. కరోనా వైరస్‌ ప్రమాదకర స్థాయిలో ఉన్న సమయంలో ఒలింపిక్ క్రీడల నిర్వహణ ప్రమాదానికి దారి తీస్తుందని జపాన్ వైద్యుల సంఘం హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహిస్తే సరికొత్త స్ట్రెయిన్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని జపాన్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నావోటో యుమేమా తెలిపారు.

Olympics 2021 : ఒలింపిక్స్ పై జపాన్ లో వ్యతిరేకత

Japan

Japan : మెగా క్రీడలైన ఒలింపిక్స్‌పై జపాన్‌లో వ్యతిరేకత రోజు రోజుకు అధికమవుతోంది. కరోనా వైరస్‌ ప్రమాదకర స్థాయిలో ఉన్న సమయంలో ఒలింపిక్ క్రీడల నిర్వహణ ప్రమాదానికి దారి తీస్తుందని జపాన్ వైద్యుల సంఘం హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహిస్తే సరికొత్త స్ట్రెయిన్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని జపాన్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నావోటో యుమేమా తెలిపారు. ఇప్పటికే చాలా దేశాల్లో వైరస్ విభిన్న రకాల స్ట్రెయిన్స్‌తో వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మెగా క్రీడల కోసం దాదాపుగా 200 దేశాల నుంచి అథ్లెట్లు, కోచ్‌లు, ప్రజలు వస్తారని వారంతా చోట చేరితే అప్పుడు ఓ కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌ ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆ పరిస్థితే వస్తే టోక్యో ఒలింపిక్స్‌ స్ట్రెయిన్‌ అర్థం వచ్చేలా పిలవాల్సి ఉంటుందన్నారు. అంతేకాదు.. జపాన్‌లో ఆరోగ్య సంక్షోభం ఏర్పడే అవకాశం లేకపోలేదని, ఇదే జరిగితే కనీసం వందేళ్ల వరకు విమర్శలకు దారితీయొచ్చు అని నావోటో హెచ్చరించారు. ప్రస్తుతం జపాన్‌లో కరోనా వైరస్‌ విపరీతంగా వ్యాపిస్తోంది. ఆ దేశంలో కేవలం 5 శాతం మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తైంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో నగరాల్లో అత్యవసర వైద్య పరిస్థితిని పొడిగించారు.

ఈ నేపథ్యంలో మెగా క్రీడలను రద్దు చేయాలని 70 శాతం మంది ప్రజలు కోరుతున్నారు. ఒలింపిక్స్‌ ఆరంభ సమయానికి 90 శాతం మంది క్రీడాకారులకు టీకా కార్యక్రమం పూర్తవుతుందని, కఠిన ఆంక్షలు, బుడగల మధ్య క్రీడలు నిర్వహిస్తామని ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్స్‌ సంఘం ప్రకటించాయి. కానీ ఆ దేశ వైద్యుల సంఘం హెచ్చరికల నేపథ్యంలో మెగా ఈవెంట్ రద్దు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. మొండిగా ఒలింపిక్స్ నిర్వహిస్తే కొత్త స్ట్రెయిన్‌తో ఆరోగ్య సంక్షోభం ఏర్పడనుంది. నిర్వహించకపోతే వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. దీంతో ఒలింపిక్స్‌ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది.

Read More : Attack on BJP MP : బీజేపీ ఎంపీ రంజితా కోలి కారుపై రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి..