Tokyo : వారి మెడలో పతకాలు పడినా..జాతీయ గీతం వినిపించదు

అమెరికా విన్యాసాలకు రష్యా జిమ్నాస్టులు చెక్ పెట్టారు. అకయిమోవా, లిస్టునోవా, మెల్నికోవా, వురజొవాతో కూడని రష్యా బృందం..అమెరికా హ్యాట్రిక్ స్వర్ణావకాశాన్ని దెబ్బతీసి మరీ విజేతగా నిలిచింది. అయితే..ఇంతటి విజయాలు సాధించినా...రష్యన్లకు పోడియం వద్ద అసంతృప్తే దక్కుతోంది.

Tokyo : వారి మెడలో పతకాలు పడినా..జాతీయ గీతం వినిపించదు

Tokyo Olympics

No National Anthem On Podium : క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారుల దేశాలకు సంబంధించిన జాతీయ గీతాలను వినిపించడం సర్వ సాధారణం. ఒలింపిక్ క్రీడల్లో కూడా వారి వారి దేశాలకు చెందిన జాతీయ గీతాలను వినిపిస్తున్నారు. కానీ ఓ దేశానికి చెందిన జాతీయ గీతాన్ని మాత్రం వినిపించడం లేదు. దీంతో ఆ దేశాలకు చెందిన క్రీడాకారులు తీవ్ర నిరాశ చెందుతున్నారు పతకాలు గెలిచినా..వారిలో ఆనందం నిలవడం లేదు. ఒలింపిక్ క్రీడల్లో రష్యా క్రీడాకారులు ప్రతిభ చాటుతున్నారు. పలు విభాగాల్లో విజయాలు సాధిస్తూ..పతకాలు సాధిస్తున్నారు. రష్యా స్విమ్మర్లు రిలోవ్, కొలెస్నికోవ్ బంగారు, రజత పతకాలు సాధించారు.

Read More : రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

అమెరికా విన్యాసాలకు రష్యా జిమ్నాస్టులు చెక్ పెట్టారు. అకయిమోవా, లిస్టునోవా, మెల్నికోవా, వురజొవాతో కూడని రష్యా బృందం..అమెరికా హ్యాట్రిక్ స్వర్ణావకాశాన్ని దెబ్బతీసి మరీ విజేతగా నిలిచింది. అయితే..ఇంతటి విజయాలు సాధించినా…రష్యన్లకు పోడియం వద్ద అసంతృప్తే దక్కుతోంది. పోడియంలో వారి మెడలో పతకాలు పడినా..అక్కడ జాతీయ గీతం వినిపించదు. ఓ సంగీతం మాత్రమే వినిపిస్తారు. జెండా బదులు ROC జెండాను ఎగురేస్తారు. దీనికి ఓ కారణం ఉంది. వ్యవస్థీకృత డోపింగ్ ఉదంతం రష్యా దేశంపై నిషేధం కొనసాగుతోంది. నిష్కళంక అథ్లెట్లను మాత్రం రష్యా ఒలింపిక్ కమిటీ (ROC) జెండా కింద పోటీ పడేందుకు అవకాశం మాత్రమే ఇచ్చింది. ఇది రష్యా అథ్లెట్లకు పతకం గెలిచిన ఆనందాన్ని దూరం చేస్తోంది.