Olympics 2021: టోక్యో ఒలంపిక్స్‌కు వెళ్లనున్న క్రీడాకారులతో మోడీ భేటీ

మరికొద్ది రోజుల్లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కు భారత ప్లేయర్లు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీకి వెళ్లబోయే ప్లేయర్లలో స్ఫూర్తిని నింపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వారితో ప్రత్యేక సమావేశం కానున్నారు.

Olympics 2021: టోక్యో ఒలంపిక్స్‌కు వెళ్లనున్న క్రీడాకారులతో మోడీ భేటీ

Olympic (1)

Olympics 2021: మరికొద్ది రోజుల్లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కు భారత ప్లేయర్లు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీకి వెళ్లబోయే ప్లేయర్లలో స్ఫూర్తిని నింపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వారితో ప్రత్యేక సమావేశం కానున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు వర్చువల్ పద్ధతిలో జరగనున్న సమావేశంలో భేటీ కానున్నారు.

ఈ టోర్నీకి 18 విభాగాల్లో పాల్గొనేందుకు 126 మంది భారతీయ క్రీడాకారులు అర్హత సాధించారు. ఇండియా నుంచి అత్యధికంగా ఇంతమంది అథ్లెట్లను వెళ్లడం ఇదే తొలిసారి అని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని అర్హత సాధించిన ప్లేయర్ గురించి ప్రస్తావించారు. ఇండియా నుంచి సైలర్ విభాగంలో అర్హత సాధించిన నేత్రా కుమానన్, స్విమ్మర్లు సాజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజ్ ఏ క్వాలిఫికేషన్ స్టాండర్ట్ సాధించి అర్హత సాధించారు.