Tokyo Olympics : కరోనాను జయించాడు..స్వర్ణ పతకాన్ని గెలిచిన స్విమ్మర్

ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. ఇందులో పాల్గొన్న క్రీడాకారులకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి బయటపడి..ఒలింపిక్స్ లో పాల్గొని ఏకంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. కరోనా సోకిన అనంతరం విమర్శలు చేసిన వారి పతకం ద్వారా నోటికి తాళం వేశాడు.

Tokyo Olympics : కరోనాను జయించాడు..స్వర్ణ పతకాన్ని గెలిచిన స్విమ్మర్

Tom Dean

Tom Dean Takes Gold : ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. ఇందులో పాల్గొన్న క్రీడాకారులకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి బయటపడి..ఒలింపిక్స్ లో పాల్గొని ఏకంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. కరోనా సోకిన అనంతరం విమర్శలు చేసిన వారి పతకం ద్వారా నోటికి తాళం వేశాడు. ఒకసారి కాదు..రెండు సార్లు కరోనా బారిన పడి..దాన్ని జయించి..పోటీలో పాల్గొని విజయం సాధించిన ఇతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు జరిగిన పురుషుల 200 మీటర్ల ప్రీ స్టయిల్ ఈవెంట్ లో టామ్ బంగారు పతకం గెలుపొందాడు.

Read More : Illegal Liquor: ఫారెన్ బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లతో నకిలీ మద్యం తయారీ

బ్రిటన్ కు చెందిన స్విమ్మర్ టామ్ డియాన్. ఇతనికి సెప్టెంబర్ నెలలో కరోనా వైరస్ సోకింది. మళ్లీ నాలుగు నెలలకే జనవరిలో వైరస్ బారిన పడడంతో టామ్ తీవ్రంగా కృంగిపోయాడు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ వల్ల దగ్గు బాగా వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఒలింపిక్స్ ఏం వెళుతాడు ? అని అనుకున్నారు. అయితే..ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నాడు. టామ్ అందరికంటే ముందుగా..1ని. 44.22 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. అతని సహచరుడు డన్‌కన్‌ స్కాట్‌ (1ని:44.26 సెకన్లు) రజతం, బ్రెజిల్‌ స్విమ్మర్‌ ఫెర్నాండో (1ని:44.66 సెకన్లు) కాంస్యం గెలిచారు.