Tokyo Paralympics: డిస్కస్ త్రోలో వినోద్ కుమార్‌కు కాంస్యం

ఇండియన్ ప్లేయర్ వినోద్ కుమార్ పారాలింపిక్స్ టోర్నీలో కాంస్యం సాధించాడు. డిస్కస్ త్రోలో పాల్గొన్న వినోద్.. ఆదివారం F52ఈవెంట్ లో 19.91మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు.

Tokyo Paralympics: డిస్కస్ త్రోలో వినోద్ కుమార్‌కు కాంస్యం

Vinod Kumar

Tokyo Paralympics: ఇండియన్ ప్లేయర్ వినోద్ కుమార్ పారాలింపిక్స్ టోర్నీలో కాంస్యం సాధించాడు. డిస్కస్ త్రోలో పాల్గొన్న వినోద్.. ఆదివారం F52ఈవెంట్ లో 19.91మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. కాంస్య పతకమే కాకుండా ఆసియా రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే గోల్డ్ విన్నర్ పోలాండ్ ప్లేయర్ పియోటర్ కొసెవిజ్ 20.02మీటర్లు, క్రొయేషియన్ అథ్లెట్ వెలిమిర్ శాండూర్ 19.98మీటర్లతో రజితం దక్కింది.

ఆర్మీ కుటుంబానికి చెందిన వినోద్ కుమార్ తండ్రి.. 1971 యుద్ధంలో పాల్గొన్నారు. వినోద్ కూడా బీఎస్ఎఫ్‌లో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేశాడు. చదువు అయిపోయాక జాయిన్ అవ్వాలని భావించగా.. 2002 ట్రైనింగ్ పీరియడ్ లో పర్వతంపై నుంచి కిందపడిపోయాడు. కాళ్లకు తీవ్రంగా గాయాలై 10ఏళ్ల పాటు కదలలేని స్థితిలో ఉండిపోయాడు. ఆ సమయంలోనే పేరెంట్స్ ను కూడా కోల్పోయాడు.

2016లో పారా స్పోర్ట్స్ ఉంటుందని తెలుసుకున్నాడు. రోహ్‌టక్ లో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వెళ్లి కలుసుకున్నాడు. ట్రైనింగ్ స్టార్ట్ చేసి లోకల్ కోచ్ లతో ప్రయాణం మొదలుపెట్టాడు.