IND vs NZ 3rd T20: రేపు ఇండియా వర్సెస్ కివీస్ మధ్య కీలక మ్యాచ్ .. తుది జట్టులోకి పృథ్వీ షా, జితేశ్ శర్మ ..!
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 1న మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరుగ్గా 1-1 విజయంతో రెండు టీంలు సమఉజ్జీలుగా ఉన్నాయి. బుధవారం జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది.

IND vs NZ 3rd T20: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 1న మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరుగ్గా 1-1 విజయంతో రెండు టీంలు సమఉజ్జీలుగా ఉన్నాయి. బుధవారం జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది. టీమిండియాలో ఓపెనింగ్ జోడీ ఇబ్బందికరంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ – శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీ అద్భుతంగా రాణించారు. మ్యాచ్ ప్రారంభంలో పరుగుల వరద పారించారు. టీ20 విషయానికి వచ్చే సరికి గిల్, ఇషాన్ జోడీ మ్యాచ్ ఆరంభంలో పరుగులు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది.
IND Vs NZ 3rd T20I : భారత్ భళా.. న్యూజిలాండ్‌తో సిరీస్ క్లీన్ స్వీప్
వన్డేల్లో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డ గిల్.. టీ20 మ్యాచ్ కు వచ్చేసరికి ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇక ఇషాన్ కిషన్ రెండు మ్యాచ్ లలో అవకాశం దొరికినా ఏ మాత్రం రాణించలేక పోయాడు. రనౌట్ల రూపంలో వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్ ప్రారంభంలో పరుగులురాక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల పై ఒత్తిడి పడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో గిల్, ఇషాన్ కిషన్ లలో ఒకరిని తప్పించి పృథ్వీషాకు అవకాశం ఇచ్చేందుకు సెలక్టర్లు దృష్టిసారించారు.
పృథ్వీ షా ముంబై ఓపెనర్‌గా బరిలోకిదిగి రంజీల్లో అస్సాంపై ట్రిపుల్ సెంచరీ (379) చేశాడు. దేశవాళీలో అద్భుత ఇన్నింగ్స్ లు ఆడిన పృథ్వీకి జాతీయ జట్టు తరపున అవకాశం దక్కడం లేదు.
IND vs NZ T20 Match: ఉత్కంఠభరిత పోరులో కివీస్‌పై టీమిండియా విజయం.. ఫొటోలు
టీ20 సిరీస్‌కు ఎంపికైన పృథ్వీ షా తొలిరెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. వన్డేల్లో అద్భుత ప్రతిభ చూపిన గిల్ .. టీ20 సిరీస్‍లోనూ రాణిస్తాడని కోచ్ ద్రావిడ్, కెప్టెన్ హార్ధిక్ భావించారు. అయితే రెండు మ్యాచ్‌లలో గిల్ విఫలం కావటంతో అతని స్థానంలో పృథ్వీ షాను మూడో టీ20 మ్యాచ్‌లో బరిలోకి దింపేందుకు కోచ్, కెప్టెన్ ఇద్దరూ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇషాన్ ప్లేస్‌లో వికెట్ కీపర్, బ్యాటర్ జితేశ్ శర్మకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇషాన్‌ను పక్కకు పెడితే జితేశ్ శర్మకు అవకాశం ఉంటుంది. గిల్ ప్లేస్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. ఒకవేళ గిల్‌ను పక్కకు పెడితే అతని స్థానంలో పృథ్వీ షా తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాకాకుండా మరోసారి ఓపెన్లుగా గిల్, ఇషాన్ కిషన్‌నే కొనసాగించవచ్చు కూడా. దీంతో రేపు సాయంత్రం 7గంటలకు జరిగే కీలక మ్యాచ్‌లో తుది జట్టు ఎలా ఉంటుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.