India vs New Zealand: రేపే న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. పొంచి ఉన్న వర్షం ముప్పు

ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ మ్యాచ్ గెలవడం ఇండియాకు చాలా కీలకం.

India vs New Zealand: రేపే న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. పొంచి ఉన్న వర్షం ముప్పు

India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ స్టేడియం వేదికగా ఉదయం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి వన్డేలో న్యూజిలాండ్‌ గెలుపొందింది. రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది.

Women’s IPL: మహిళల ఐపీఎల్‌ ఫ్రాంచైజీ వేలానికి సిద్ధమవుతున్న బీసీసీఐ.. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ.400 కోట్లు

దీంతో న్యూజిలాండ్‌ ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇండియాకు మూడో వన్డే చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది. లేదంటే 2-0తో సిరీస్ కోల్పోవాల్సి వస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. బుధవారం క్రైస్ట్‌చర్చ్‌లో వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 93 శాతం ఆకాశాన్ని మబ్బులు కమ్మేసే అవకాశాలు ఉన్నాయని, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఏడు శాతం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వర్షం పడితే సిరీస్ 1-0తో కివీస్ వశమవుతుంది. ఇండియాకు సంబంధించి బ్యాటింగ్ విభాగం బలంగానే కనిపిస్తోంది. అయితే, బౌలింగ్, ఫీల్డింగ్‌లో లోపాలు ఇండియాను వేధిస్తున్నాయి.

Savitri Jindal: భారతీయ సంపన్న మహిళగా సావిత్రి జిందాల్.. జాబితా వెల్లడించిన ఫోర్బ్స్

మొదటి వన్డేలో భారత బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. కానీ, బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అదనపు బౌలర్ కోసం రెండో వన్డేలో సంజూ శామ్సన్‌ను పక్కనబెట్టి, అతడి స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి మ్యాచ్ కోసం కూడా ఇదే జట్టుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.