T20 World Cup Final: ఆరేళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో.. ఫైనల్‌లో కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుదా?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరాయి.

T20 World Cup Final: ఆరేళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో.. ఫైనల్‌లో కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుదా?

Nz Auss

T20 World Cup Final: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరాయి. రెండు జట్లూ టైటిల్ పోరులో గెలుపు కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈసారి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ కొత్త విజేతను చూస్తుంది. ఫైనల్ చేరుకున్న రెండు జట్లు కూడా ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. ఏ జట్టు గెలిచినా.. అది మొదటిసారి విజయం సాధించినట్లే. ఆదివారం(14 నవంబర్ 2021) రెండు జట్ల మధ్య కీలకమైన పోరు జరగనుంది.

కేన్ విలియమ్సన్ నేతృత్వంలో కివీస్ జట్టు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోండగా.. టెస్టు క్రికెట్‌, వన్డేల్లో నంబర్‌వన్‌‌గా ఉన్న ఈ జట్టు.. ఆస్ట్రేలియాపై గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే వన్డే, టెస్ట్ క్రికెట్‌లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. టీ20ల్లో నంబర్‌వన్‌గా అవతరించడం మాత్రం సాధ్యం కాదు. నవంబర్ 17వ తేదీ నుంచి టీమ్ ఇండియాతో జరిగే టీ20 సిరీస్‌లో భారత్‌ను 3-0తో ఓడిస్తేనే టాప్‌లోకి వస్తుంది. విలియమ్సన్ జట్టు టీ20 క్రికెట్‌లో నాల్గో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ టీ20ల్లో నంబర్‌వన్‌ స్థానంలో నిలిచి ఉంది.

Maoist Ravi died : బాంబులు తయారుచేస్తుండగా..పేలి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి

2019 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓటమికి న్యూజిలాండ్‌ ఇప్పటికే ప్రతీకారం తీర్చుకోగా.. 2015 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోగా.. అప్పటి ప్రతీకారం తీర్చుకునేందుకు కివీస్ ఎదురుచూస్తుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇరు జట్లు ఫైనల్‌లో తలపడడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా కూడా అందివచ్చిన అవకాశంతో గెలవాలని గట్టిగా కష్టపడుతుంది. రెండు జట్లు కూడా తీవ్రంగా కష్టపడుతున్నాయి.

Corona effect on USA: కరోనా విజృంభణ.. అమెరికాలో ఆస్పత్రులు ఫుల్