సాకర్ లెజెండ్ కు నివాళులు, విషాదంలో ఫుట్ బాల్ అభిమానులు

  • Published By: madhu ,Published On : November 26, 2020 / 07:20 AM IST
సాకర్ లెజెండ్ కు నివాళులు, విషాదంలో ఫుట్ బాల్ అభిమానులు

Tribute to Soccer Legend : సాకర్‌ లెజెండ్‌ ఫుట్‌బాల్ ప్లేయర్‌ డిగో మారడోనా కన్నుమూశారు. గుండెపోటుతో 60 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని వదిలివెళ్లారు. రెండు వారాల క్రితమే మెదడు సంబంధిత వ్యాధి నుంచి కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అంతలోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మారడోనా మృతితో ఫుట్‌బాల్‌ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. చూసేందుకు ఆయనేమీ ఆజానుబాహుడు కాదు. అయితేనేమీ ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు.



తన ఫుట్‌బాల్‌ ఆటతో ప్రపంచానికి తను పరిచయమయ్యాడు. ఆయనే అర్జెంటీనాకు చెందిన డీగో మారడోనా. ప్రతి ఫుట్‌బాల్‌ అభిమానికి డీగో పేరు తెలియకుండా ఉండదు. అప్పట్లో మారడోనా మైదానంలోకి దిగాడంటే ఒకటే కేరింతలు.. ప్రత్యర్థులకు అందకుండా గోల్‌ కొట్టడంలో ఎంతో నైపుణ్యం కలిగిన దిగ్గజ ఆటగాడు. అక్టోబర్‌ 30న 60వ వసంతంలోకి అడుగు పెట్టిన ఆయన అంతలోనే ఈ లోకం వదలివెళ్లారు.



ఈనెల మొదటి వారంలో మారడోనాకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స జరిగింది. ఓ ప్రమాదం వలన మారడోనాకు ఈ సమస్య వచ్చింది. సర్జరీ అనంతరం వారం రోజుల క్రితమే బ్యూనస్ ఏర్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఓ ప్రైవేట్ హోమ్‌లో ఉంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ అంతలోనే గుండె పోటు రావడంతో హఠాన్మరణం చెందారు.



మారడోనా అస్తమించడంతో ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఒక శకం ముగిసినట్లైంది. ఫుట్‌బాల్ పేరు చెబితే మొదటగా గుర్తొచ్చే పేరు డిగో మారడోనా. ఆ క్రీడను అంతలా ప్రభావితం చేశారాయన. అర్జెంటీనాకు ఎన్నో ట్రోఫీలు అందించారు. నాలుగు సార్లు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొన్న డిగో… 1986లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు చేర్చడంలో, కప్పు అందించడంలో మారడోనా కీలక పాత్ర పోషించారు.



https://10tv.in/taapsee-pannu-busy-in-bollywood/
ఆ టోర్నీ తర్వాత మారడోనా పేరు మార్మోగిపోయింది. 1990 ప్రపంచ కప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. ఆయన బొకా జూనియర్స్, నాపోలి, బార్సిలోనా క్లబ్ జట్ల తరఫున పలు మ్యాచ్‌‌లు ఆడారు. మారడోనా 1997లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు రిటర్మెంట్ ప్రకటించారు. 2008లో అర్జెంటీనా ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు.