MS Dhoni: ధోని ఫ్యామిలీ ఫోటో.. బ్యాక్ గ్రౌండ్‌ను ఎడిట్ చేయాలని కోరిన అభిమాని.. ఆ తరువాత
ఓ నెటీజన్ ఫోటోను పోస్ట్ చేసి దాని బ్యాగ్రౌండ్ ఎడిట్ చేమయని కోరాడు. ఇంకేముంది ఎవరికి దోచిన విధంగా వారు దాన్ని ఎడిట్ చేశారు. ఇందులో ఏముందని అంటారా..? అది మామూలు ఫోటో అయితే ఎవ్వరు అంతగా పట్టించుకునే వారు కాదు గానీ అది క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీఫోటో.

MS Dhoni family pic
MS Dhoni family: అప్పుడప్పుడు నెటీజన్లు చేసే కొన్ని పనులు చాలా ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆలోచనను రేకెత్తించే విధంగా ఉంటాయి. ఇక్కడ ఓ నెటీజన్ ఫోటోను పోస్ట్ చేసి దాని బ్యాగ్రౌండ్ ఎడిట్ చేమయని కోరాడు. ఇంకేముంది ఎవరికి దోచిన విధంగా వారు దాన్ని ఎడిట్ చేశారు. ఇందులో ఏముందని అంటారా..? అది మామూలు ఫోటో అయితే ఎవ్వరు అంతగా పట్టించుకునే వారు కాదు గానీ అది క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీ(MS Dhoni family) ఫోటో.
ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచిన తరువాత స్టేడియంలో భార్య సాక్షి, కూతురు జివాతో కలిసి ధోని ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇందులోని ఓ ఫోటోను ధోని భార్య సాక్షి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
MS Dhoni: శుభవార్త.. ధోని మోకాలి ఆపరేషన్ సక్సెస్
ఈ ఫోటోనే పోస్ట్ చేసిన ఓ నెటీజన్.. ముగ్గురిని అలాగే ఉంచి బ్యాక్ గ్రౌండ్ ఎడిట్ చేయాలని కోరాడు. అతడు అలా కోరాడో లేదో చాలా మంది స్పందించారు. ఎవరికి తోచిన విధంగా బ్యాక్ గ్రౌండ్ ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. కొందరు ఎడిట్ అవసరం లేదని అలా ఉంటేనే ఫోటో చాలా అందంగా ఉందని కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే చాలా మంది ‘లవ్ యు మహి’ అంటూ కామెంట్ సెక్షన్‌లో రాశారు.
Here you go pic.twitter.com/5gImcqTiym
— Chirag (Charles) Patel (@ChiraginHFCC) May 31, 2023
ఇదిలా ఉంటే.. మోకాలి గాయంతో బాధపడుతున్న ధోని ఆపరేషన్ చేయించుకున్నాడు. గురువారం(జూన్ 1న) ఉదయం నిర్వహించిన సర్జరీ విజయవంతమైందని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్(Kasi Viswanathan) ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉండనున్న ధోని ఆ తరువాత డిశ్చార్జి కానున్నారు. మహేంద్రుడు కోలుకునేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందనే విషయాన్ని చెప్పలేదు కానీ రెండు మూడు నెలల్లో అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Done! pic.twitter.com/hrCYXoGbcR
— anurag (@speck_universe) May 31, 2023
Anything else pic.twitter.com/GipUE703ke
— Ruhi (@ruhi_mengi) May 31, 2023