U-19 Asia Cup: ఆసియా కప్‌లో మెరిసిన యువ ఆటగాళ్లు.. అఫ్ఘాన్‌పై 4వికెట్ల తేడాతో విజయం

అండర్-19 ఆసియా కప్ 2021లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో అఫ్ఘానిస్తాన్‌ను ఓడించింది.

U-19 Asia Cup: ఆసియా కప్‌లో మెరిసిన యువ ఆటగాళ్లు.. అఫ్ఘాన్‌పై 4వికెట్ల తేడాతో విజయం

Bharat

ACC U19 Asia Cup 2021 India U19 won by 4 wickets: అండర్-19 ఆసియా కప్ 2021లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో అఫ్ఘానిస్తాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్.. హర్నూర్ సింగ్ అర్ధ సెంచరీ సాయంతో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 262పరుగులు చేసి విజయం సాధించింది. హర్నూర్ సింగ్ ప్రదర్శన భారత్‌కు కీలకం కాగా.. 9 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేశాడు హర్నూర్ సింగ్. హర్నూర్‌తో కలిసి రాజ్‌బావా 43 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.

అఫ్గాన్ జట్టు తరపున కెప్టెన్ సులేమాన్ సైఫీ 73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో సైఫీ 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఎజాజ్ అహ్మద్ అజేయంగా 86 పరుగులు చేయగా.. టీమిండియా 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించారు. భారత్ తరఫున హర్నూర్ సింగ్ 74 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అంగ్ క్రిష్ రఘువంశీ 35 పరుగులు చేశాడు. 26 పరుగుల వద్ద కెప్టెన్ యష్ ఔటయ్యాడు. చివర్లో కుశాల్ 35 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కుశాల్ 35, రాజ్ కూడా 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ACC అండర్-19 ఆసియా కప్ 2021 పాయింట్ల పట్టికలో, టీమ్ ఇండియా గ్రూప్ Aలో రెండవ స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌లు గెలిచింది. మూడు మ్యాచ్‌లు ఆడిన పాక్‌ మూడింటిలోనూ విజయం సాధించింది.

గ్రూప్‌-ఎలో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. గ్రూప్‌ Bలో బంగ్లాదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా.. శ్రీలంక రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లకు నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది.